తెలంగాణ నుంచి లక్ష కోట్ల ఆస్తులు రావాలా.. చంద్రబాబు, జగన్ ఏం చేశారో?

cm jagan and chandrababu naidu

తెలంగాణ అధికార పార్టీ నేతలు ఏపీ విషయంలో విమర్శలు చేయడానికి ముందువరసలో ఉంటారు. అయితే హైదరాబాద్ లాంటి రాజధాని లేకపోవడమే ఏపీ ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పడానికి మాత్రం వాళ్లు అంగీకరించరు. విభజన హామీల ప్రకారం తెలంగాణ నుండి ఏపీకి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు రావాల్సి ఉందని సమాచారం. చంద్రబాబు విభజన తర్వాత ఐదేళ్లు సీఎంగా ఉన్నా ఈ ఆస్తుల విషయంలో ఒకింత నిర్లక్ష్యంగానే వ్యవహరించారు.

ప్రస్తుతం జగన్ సైతం ఈ ఆస్తుల సమస్యను సీరియస్ గా తీసుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం కోసం పోరాటం చేసే విషయంలో చంద్రబాబు, జగన్ ఫెయిల్ అవుతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్లు చేయడం గమనార్హం. టీడీపీ గత ఎన్నికల్లో ఓటమిపాలు కావడానికి ఇదే కారణమని కేంద్రంతో జగన్ కయ్యానికి కాలు దువ్వి విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ఆ లక్ష కోట్ల రూపాయల ఆస్తుల వల్ల ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. జగన్, చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆ ఆస్తులపై దృష్టి పెడితే బాగుంటుందని చెప్పవచ్చు. తెలంగాణ నుంచి విభజన హామీల ప్రకారం రావాల్సిన ఆస్తులు ఏపీకి వస్తే ఏపీకి కచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

జగన్ తలచుకుంటే అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు. రాబోయే 15 నెలలలో జగన్ ఎంత కష్టపడితే ఆ కష్టానికి రెట్టింపు ఫలితం దక్కుతుందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా జగన్ అడుగులు వేసినా ఎలాంటి నష్టం ఉండదనే సంగతి తెలిసిందే. ఈ విషయాలను జగన్ గుర్తుంచుకుంటారో లేదో చూడాలి.