దేశంలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగినా ఏపీకి ఏ కంపెనీ వచ్చినా ఆ అభివృద్ధి తన వల్లే జరిగిందని చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తులలో చంద్రబాబు ఒకరు. ఇందుకు సంబంధించి పలు సందర్భాల్లో విమర్శలు వ్యక్తమైనా చంద్రబాబు మాత్రం వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఛాన్స్ జరిగినా తన వల్లే అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు దాదాపుగా రెండు గంటల పాటు వాట్సాప్ యాప్ పని చేయలేదు.
టెకినల్ రీజన్స్ వల్ల వాట్సాప్ పని చేయకపోవడంతో వాట్సాప్ యూజర్లు తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డారు. అయితే మధ్యాహ్నం 2.14 గంటల నుంచి వాట్సాప్ పని చేస్తోంది. అయితే చంద్రబాబు వల్లే వాట్సాప్ పని చేస్తుందంటూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పెడుతున్న పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్రబాబు తన వల్లే వాట్సాప్ పని చేస్తుందని ఎలాగో చెబుతారని భావించి వైసీపీ నేతలు ఈ విధంగా పోస్ట్ లు పెడుతుండటం గమనార్హం.
వాట్సాప్ పని చేస్తుండటంతో చంద్రబాబు గురించి ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయంటూ వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జీ దేవేంద్ర రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం గమనార్హం. “నా వంతు ప్రయత్నం చేస్తున్నా తమ్ముళ్లు.. ఏదోలా సరి చేస్తానని తెలియజేసుకుంటున్నా” అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం. దేవేంద్ర రెడ్డి పోస్ట్ కు రికార్డు స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.
వాట్సాప్ డౌన్ కావడంతో చంద్రబాబు పేరు ఈ విధంగా వార్తల్లో నిలవడంపై చంద్రబాబు ఫ్యాన్స్ మాత్రం ఫీలవుతున్నారు. వాట్సాప్ కు గ్రహణం పట్టిందని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టగా ఆ పోస్ట్ లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతల పోస్ట్ లపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.