టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని రాజకీయ కొవిదుడని అనుకుంటారు. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసి చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో అక్రమాలు..అవినీతి జరిగినట్లు అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విచారణకు అదేశిస్తే చంద్రబాబు నాయుడు అండ్ కో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. విచారణ వద్దని ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం తమ పార్టీ నిప్పు అని ప్రగల్బాలు పలికిన నేతలు ఇప్పుడు కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నట్లు? అవినీతికి పాల్పడితే ఎలాంటి విచారణైనా చేపట్టండని సవాళ్లు విసిరేవారు.
మరి ఇప్పుడెందుకు దాగుంటున్నారు. ఇప్పుడెందుకు హత్యా రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి? నిజంగా..నిజాయితీగా ఉన్నప్పుడు భయపడాల్సిన పనేంటి? అవినీతికి పాల్పడలేదు కాబట్టి భయమెందుకు? మరెందుకు ముందస్తుగా కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు? వంటి ఆసక్తికర ప్రశ్నలు మేథావుల బుర్రలను తొలిచేస్తున్నాయి. తప్పు ఎవరు చేసినా? ఏ ప్రభుత్వం చేసినా విచారణ తప్పని సరి. దానికి జగన్ మోహన్ రెడ్డి గానీ..చంద్రబాబు నాయుడుగానీ అతీతులు కారు.
గతంలో ఇలాంటి అభియోగాల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి జైలు కెళ్లిన మాట వాస్తవం. మరి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు భయడపుతున్నాడు. విచారణ వద్దు అన్నారంటే ఓటమిని అంగీకరించినట్లేనని అని వైసీపీ వర్గీయులు భావిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లే ఉంది. ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగానే ఉండాలి. అవినీతి జరిగితే చట్టానికి ఎవరూ అతీతులు కారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిందే…శిక్ష పడాల్సిందే…జైలుకు వెళ్లాల్సిందే.