బాబోరి ఆగ్రహం.! పవన్ కళ్యాణ్ పద్ధతేం బాగాలేదట.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు టీడీపీ అను‘కుల’ మీడియాలో దర్శనమిచ్చాయ్. మామూలుగా అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనల్ని ‘కవర్’ చేయడానికి టీడీపీ అను‘కుల’ మీడియా అంతగా ఇష్టపడదు.

కానీ, ఈసారి వ్యవహారం వేరేలా వుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టీడీపీ అను‘కుల’ మీడియానే పవన్ కళ్యాణ్ వెంట పడిందిట. ఇంటర్వ్యూల కోసం ప్రాధేయ పడిందట.

సమయం చూసుకుని, జనసేనాని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ చెప్పినవీ, చెప్పనివీ.. అన్నీ వున్నాయట. అంటే, అర్థాలు.. పెడార్థాలు.. దీర్ఘాలూ.. ఇలా వండి వడ్డించబడ్డాయట. నిజమేనా.? ఏమో మరి, నిప్పు లేకుండా పొగ అయితే పుట్టదు కదా.!

ఆయా ఇంటర్వ్యూలు చేయడం పూర్తయ్యాక, టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకి వెళ్ళిందట ఆ వ్యవహారం. పొత్తులకు ఇబ్బంది లేకుండా.. ఇంటర్వ్యూల్లోని కంటెంట్‌ని కాస్త ఆల్టర్ చేయించారట టీడీపీ అధినేత.

అసలు నిజంగా అలా జరుగుతుందా.? అంటే, చంద్రబాబు మార్కు రాజకీయమే అంత.! పైగా, అక్కడున్నది టీడీపీ అను‘కుల’ మీడియా.! ఇంతకీ, పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది.? బాబోరి అంచనాల ప్రకారం, ‘పవన్ కళ్యాణ్ పద్ధతేం బాగాలేదు’ అని.!

‘నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని.. ముఖ్యమంత్రినవడానికి సిద్ధంగా వున్నాను..’ అని వారాహి యాత్రలో పవన్ చెప్పిన మాటలు, చంద్రబాబుకి రుచించలేదుట.