తారకరత్న ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్న చంద్రబాబు!

స్వర్గీయ నందమూరి తారకరత్న మరణం… నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో పాటు యావత్ తెలుగు రాష్ట్రాల్లో విషాధం నింపిన సంగతి తెలిసిందే. సౌమ్యుడు, వివాదరహితుడుగా పేరున్న తారకరత్న చిన్నవయసులోనే శివైక్యం అవ్వడం అందరినీ బాధించింది.. జీర్ణించుకోవడానికి కష్టంగా మారింది. అయితే తాజాగా తారకరత్న కుటుంబం విషయంలో చంద్రబాబు తీసుకోబోతున్నారని చెబుతున్న ఒక నిర్ణయంపై టీడీపీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

చంద్రబాబు తాను సేఫ్ జోన్ గా కుప్పం నియోజకవర్గాన్ని చూస్తారు. అక్కడైతేనే తన గెలుపు సులువని నమ్ముతుంటారు. ఇక టీడీపీకి మరో సేఫ్ జోన్ గా ఉన్న హిందూపూర్ లో బాలయ్య నిలబడుతున్నారు. అక్కడ టీడీపీ నుంచి ఎవరిని పోటీకి పెట్టినా గెలుస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక అమరావతి రాజధాని నిర్ణయంపై నమ్మకంతో లోకేష్ కు మంగళగిరి సేఫ్ అని భావించిన బాబు.. అక్కడ నుంచి తనయుడిని పోటీచేయించారు. అయితే అమరావతి ఎఫెక్ట్ చినబాబుకు గట్టిగా తగిలింది. ఫలితంగా వ్యతిరేక ఫలితాలొచ్చాయి.

ఈ సమయంలో తన విషయంలో సేఫ్ నియోజకవర్గాలను ఎంచుకునే చంద్రబాబు… బాలయ్య మినహా నందమూరి వారసులపై ఆ జాగ్రత్తలు తీసుకోరు! వారిని ఏదోరకంగా ప్రజాప్రతినిధులుగా చేయాలని భావించరు!! అధికారంలో ఉన్నప్పుడు తన కుమారుడిని ఎమ్మెల్సీ ని చేసి మరీ మంత్రిపదవి కల్పించారు. కానీ… నందమూరి వారసుల విషయంలో మాత్రం… వారు ఓడిపోతారని తెలిసినా.. కనీసం ఆ సెంటిమెంట్ ఇతర నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందేమో అన్న స్వార్థపూర్తిగా ఆలోచనలు చేస్తుంటారు.

దీనికి… గత ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని పోటీకి నిలబెట్టడమే ఒక ఉదాహరణ. ఆ ఎన్నికల్లో ఆమె ఘోరంగా బలైన సంగతి తెలిసిందే. ఇది బాబుకి ముందుగానే తెలియంది కాదు! అయినా సరే… నందమూరి వారసుల విషయంలో బాబు నిర్ణయాలు అలానే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో టీడీపీకి ప్రధాన సమస్యగా ఉన్న నియోజకవర్గాల్లో కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ ఒకటి. ఇక్కడనుంచి పోటీ చేసి గెలవడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ కష్టమనే కామెంట్లు రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తుంటాయి. ఈ విషయం కూడా బాబుకు తెలియంది కాదు.

అయితే ఈసారి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఈ నియోజకవర్గ నుంచి పోటీచేయించాలని చంద్రబాబు భావిస్తున్నారని ఆన్ లైన్ వేదికగా గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇది వ్యూహంలో భాగంగా తమ్ముళ్లే చేస్తున్నారా.. లేక మరోవర్గం ప్రచారం చేస్తున్నారా అన్నది తెలియదు కానీ… ప్రస్తుతం ఈ నియోజకవర్గం విషయంలో ఆందోళనగా ఉన్న బాబు… ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మాత్రం ప్రచారంలో ఉంది. దీంతో… ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తారకరత్న అభిమానులు.

నిజంగా తారకరత్నపై అంత ప్రేమ ఉంటే.. అలేఖ్యపై అంత సింపతీ ఉంటే.. సులువుగా గెలిచే నియోజకవర్గాన్ని ఎంపిక చేయాలి, అలా కానిపక్షంలో ఆమెను ఎమ్మెల్సీని చేసి.. చట్టసభల్లోకి వెళ్లాలన్న తారకరత్న కోరికను ఇలా తీర్చాలి. అంతే కానీ.. గుడివాడలాంటి కీలకమైన నియోజకవర్గంలో అలేఖ్యను పోటీకి పెట్టడం అంటే… అది తారకరత్న ఆత్మను క్షోభకు గురిచేయడమే అని అంటున్నారు నందమూరి అభిమానులు. ఇలాంటి నిర్ణయలు తీసుకునే విషయంలో బాబు పునరాలోచించాలని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి నిలిస్తే… కచ్చితంగా అలేఖ్యకు ఏదో ఒకరూపంలో చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు! అంతేతప్ప… బలిపశువుని చేయొద్దని బలంగా చెబుతున్నారు!