చంద్రబాబు హస్తిన పర్యటన.. ప్రచారం ఎక్కువ ప్రతిఫలం తక్కువ?

మోదీ చంద్రబాబు కలిస్తే ఎల్లో మీడియాకు కలిగే సంతోషం అంతాఇంతా కాదు. మోదీ మద్దతు ఉంటే ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం కష్టం కాదని భావిస్తున్న చంద్రబాబు మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నా మోదీ మాత్రం చంద్రబాబును పట్టించుకోవడం లేదు. జగన్ కు ఇచ్చిన ప్రాధాన్యతలో పదో వంతు ప్రాధాన్యత కూడా మోదీ చంద్రబాబుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.

అయితే జరుగుతున్న ప్రచారం మాత్రం మరో విధంగా ఉంది. చంద్రబాబుపై మోదీ కనీవిని ఎరుగని స్థాయిలో ప్రేమను కనబరుస్తున్నట్టు పొలిటికల్ వర్గాల్లో వార్తలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే వాస్తవంగా మాత్రం మోదీ చంద్రబాబుకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు మోదీని కలిస్తే ప్రచారం ఎక్కువ ప్రతిఫలం తక్కువ అనే పరిస్థితి ఏర్పడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు చంద్రబాబు తాను ఎక్కడికి వెళ్లినా జనం ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వాస్తవంగా మాత్రం డబ్బులు ఇచ్చి జనాలు సభలకు వచ్చేలా చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చే అవకాశం ఉంది. అయితే ఆ అవకాశాన్ని చంద్రబాబు మాత్రం వినియోగించుకోవడం లేదు.

పుత్రునిపై ప్రేమతో లోకేశ్ ను నమ్ముకుని టీడీపీని చంద్రబాబు అంధకారంలోకి నెడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్ని విమర్శలు వ్యక్తమైనా కొన్ని నిర్ణయాల విషయంలో వెనక్కు తగ్గకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మాత్రమే చంద్రబాబు మారే అవకాశం ఉంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.