బిగ్ బ్రేకింగ్… చంద్రబాబుకు వరుసగా మూడు షాకులు!

చంద్రబాబు కేసుల వ్యవహారంలో ఈ రోజు అత్యంత కీలకం అని గత రెండు రోజులుగా ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ రోజు ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది! ఇందులో భాగంగా ఒకటి కాదు రెండు కాదు వరుసపెట్టి మూడు షాకులు తగిలాయి. ఇందులో భాగంగా… మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

చంద్రబాబుకు కేసుల విషయంలో అత్యంత కీలకం ఈ రోజు అని గత రెండు రోజులుగా రాజకీయవర్గాల్లో కీలక చర్చ నడిచిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులకు బ్యాడ్ న్యూస్ వినిపించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసు, అంగుళ్ల అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో సుమారు నెల రోజులుగా ఉండటానికి కారణమైన స్కిల్ స్కాం కేసులో కూడా ఈ రోజు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇందులో భాగంగా… స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై కూడా ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది.

ఇటీవల స్కిల్ స్కాం కేసులో బాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై ఇటీవల విచారణ చేపట్టిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను విన్న సంగతి తెలిసిందే. అనంతరం తీర్పును రిజర్వే చేసింది. ఈ నేపథ్యంలో… ఈ రోజు మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్ లపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.

మరోపక్క ఇవాళ సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ విచారణకు రానుందని అంటున్నారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ద బోస్‌, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా, అక్టోబర్ 3న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్ట్ ముందు దాఖలు చేసిన పత్రాలను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాగా… అమరావతి ఇన్నర్‌ రింగు రోడ్డు అలైనమెంట్ స్కాం కేసులో ఏ-1గా ఉన్న చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ కేసులో ఏ-24 గా ఉన్నారు. అదేవిధంగా… అంగళ్లు అల్లర్ల కేసులో కూడా చంద్రబాబు ఏ-1గానే ఉన్నారు. ఈ మూడు కేసులకు సంబంధించి బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను నేడు హైకోర్టు కొట్టివేసింది.