బాబుకు ఫైవ్ కండిషన్స్ అప్లై… తిరిగి ఎక్కడ, ఎప్పుడు లొంగిపోవాలంటే…?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కంటి ఆపరేషన్ చేయించాల్సి ఉందని ఏపీ హైకోర్టులు బాబు తరుపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీఐడీ తరుపు న్యాయవాదుల నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది!

అయితే… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మెరిట్స్ ఆధారంగా కాకుండా… కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యానే బెయిల్ మంజూరు అయ్యింది. ఈ క్రమంలో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ అనంతరం నవంబర్ 28, 2023 మంగళవారం రోజున సా.5 గంటలలోపు చంద్రబాబు తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా… రాజమండ్రి జైల్ సూపరింటెండెంట్‌ ముందు బాబు తిరిగి లొంగిపోవాలి!

చంద్రబాబుకి కోర్టు విధించిన ఐదు కండిషన్లు!

1. పిటిషనర్ చంద్రబాబు రూ.1 లక్ష పూచీకత్తుతో ఇద్దరు వ్యక్తుల షూరిటీలు ట్రయల్ కోర్టుకు సమర్పించాలి!

2. పిటిషనర్ చంద్రబాబు ఆయనే చికిత్స తీసుకోవాలి. హాస్పిటల్ ఎంపికతోపాటు ఖర్చు కూడా ఆయన భరించుకోవాలి.

3. తనకు ఇచ్చిన చికిత్సకు సంబంధించిన వివరాలను పిటిషనర్ కోర్టుకు తెలియజేయాలి. ఏ హాస్పిటల్‌ లో చికిత్స తీసుకున్నారో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ కి సీల్డ్ కవర్‌ ద్వారా ఈ సమాచారం అందించాలి.

4. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినీ ప్రలోభపెట్టడం, బెదిరింపులు లేదా హామీలు ఇవ్వడం లాంటివి చేయకూడదు.

5. నవంబర్ 28, 2023న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో తనంతట తానే జైలు సూపరింటెండెంట్‌ ముందు లోంగిపోవాలి!