చంద్రబాబు అరెస్ట్ … ఈ రియాక్షన్ ఊహించలేదు!

టీడీపీ అధినేత చంద్రబాబుని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు సార్లు, దాదాపూ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలలో కొనసాగిన నేత అయిన బాబుని అరెస్ట్ చేశారని పలువురు టీవీ డిబేట్ లలో హల్ చల్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఉదయం టీవీల్లో ఈ చంద్రబాబు అరెస్ట్ వార్త చూడగానే రాష్ట్రంలో రాజకీయ భూకంపం చేలరేగిపోద్దని చాలా మంది ఊహించారు. ఎక్కడికక్కడ ధర్నాలూ, నిరసనలూ, రాస్తారోకోలూ జరిగే ఛాన్స్ ఉండొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ… అలాంటిదేమీ జరగలేదు!

వాస్తవానికి బాబు అరెస్ట్ తరువాత పర్యవసానాలు ఏమైనా ఉంటాయేమోనని ఆలోచించిన వైసీపీ ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఏకంగా ఆర్టీసీ బస్సులను రోడ్ల మీదకు రానీయకుండా జాగ్రత్తలు తీసింది. అన్ని ఆర్టీసీ బస్సులనూ డిపోలకే పరిమితం చేసింది.

ఇదే సమయంలో దాదాపు టీడీపీ నేతలందరినీ హౌస్ అరెస్టులు చేసింది. బాబుని నంద్యాలనుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తీసుకొస్తున్న సమయంలో ఆ ప్రయాణం అంత సులువుకాదని ఏపీ సీఐడీ భావించింది. అందులో భాగంగా హెలీకాప్టర్ అరేంజ్ చేసింది. అయితే అందుకు బాబు అంగీకరించకపోవడంతో రోడ్డు మార్గాన్నే తీసుకొచ్చింది.

అయితే రోడ్డు మార్గంలో కూడా పెద్దగా నిరసనలు వ్యక్తం అయినట్లు లేదు! ఎవరికి వారు ఫేస్ బుక్ లలో కామెంట్లు పెట్టుకున్నారు, టీడీపీ నేతలు టీవీ డిబేట్లకు పరిమితమయ్యారు. దీంతో అందరూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఖండిస్తున్నారు తప్ప రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు అయితే గట్టిగా చేయకపోవడమే చిత్రంగా ఉందని అంటున్నారు పర్శీలకులు.

ఇక ఇక చంద్రబాబు తరువాత టీడీపీకి ఫ్యూచర్ హోప్ అని చెప్పుకుంటున్న నారా లోకేష్ సైతం రాజోలులో పోలీసులతో వాగ్వాదానికి దిగి తన ఆవేశాన్ని ప్రదర్శించారు. అనంతరం కాసేపు కిందకూర్చుని నిరసన తెలిపారూ. ఎట్టకేలకు అనుమతి సాధించుకుని విజయవాడకు బయల్దేరి వెళ్లారు. దీంతో… ఈ కీలక సమయంలో బాబు అరెస్ట్ వంటి సీరియస్ ఘటనను ఏ విధంగా డీల్ చేయాలో టీడీపీ నేతలకు తెలియలేదనే చర్చ మాత్రం బలంగా నడుస్తుంది.

ఇక ప్రజల విషయానికొస్తే… ఎవరి దైనందిన జీవితంలో వారు బిజీ అయిపోయారు. చంద్రబాబుపై అభిమానం ఉన్నవారు అయ్యో అనుకున్నారు.. బాబుని శత్రువుగా భావించేవారు కాసేపు హ్యాపీ ఫీలయ్యారు. ఇది ఒక వార్తగా మాత్రమే ఫైనల్ గా అందరూ భావించారు. ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని అంటున్నారు.

అవును… ఒక విధంగా వైసీపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది అని అంటున్నారు. దీంతో సింపతీ వచ్చే ఛాన్స్ ఉండోచ్చని కూడా భావించిన కొంతమందికి ఇది పూర్తి నిరాసనే మిగిల్చింది. దీంతో… చంద్రబాబు అరెస్ట్ అనేది అంత సీరియస్ ఇష్యూ కాదనేలా పరిస్థితి మారిపోయింది!

ఇక చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ విషయానికొస్తే… బావమరిది బాలయ్య ఈ విషయాన్ని ఖండించారు. వదిన భువనేశ్వరి.. బీజేపీ ఖండిస్తుందని చెప్పారు. దత్తుడు అని వైసీపీ వాళ్లు చెప్పే పవన్.. సంపూర్ణంగా ఖండించారు. ఇక ఆయన భార్య భువనేశ్వరి మాత్రం పూజలు చేశారు.

చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆయన భార్య భువనేశ్వరి బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకి బెయిల్ రావాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబుకి మనో ధైర్యం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు