Chandra Babu: పవన్ చెప్పిన మాటను జీవితంలో మర్చిపోలేను.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!

Chandra Babu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడ అందరిని చూస్తుంటే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికే మనమంతా ఇక్కడ సమావేశమైనట్టు అనిపిస్తుందని తెలిపారు.

ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్ గా చేసేందుకు ఇవాళ బీజం పడింది.. ఇది సాధ్యమే అని మరొక్కసారి చెబుతున్నా. ప్రజల తలరాతను భవిష్యత్తు తరాల తలరాతను మార్చేదే స్వర్ణాంధ్ర 2047 అంటూ చంద్రబాబు తెలిపారు.నేను చాలా ఎన్నికలు చూశాను కానీ… 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 1978 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యాను.

2024లో 93 శాతం సక్సెస్ రేటుతో, 57 శాతం ఓట్లు పడిన ఏకైక ఎన్నికలు నా జీవితంలో మొదటిసారి చూశాను. ప్రజల్లో ఆనాడు ఉన్న వాస్తవ పరిస్థితులను పవన్ కల్యాణ్ గారు అప్పుడే గమనించి ఒక మాటన్నారు. ఆ మాట నేనెప్పుడూ కూడా మర్చిపోలేను. తనని జైలులో కలిసిన పవన్ కళ్యాణ్ ఒకటే మాటే నాతో చెప్పారు.

మీరు అధైర్య పడకండి ఎట్టి పరిస్థితులలో కూడా వ్యతిరేక ఓట్లను చీలనివ్వకూడదు కలిసి ఉంటే బలం ఉంటుంది… కలిసి పనిచేద్దాం అని స్పష్టమైన వైఖరి ప్రదర్శించి, ఆ మేరకు కలిసి నడిచిన వ్యక్తి పవన్ కల్యాణ్. 2014లోనూ, 2024లోనూ చూశాను… కలిసి పోటీ చేస్తే నాకేం లాభం అని ఆలోచించకుండా రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచించే ఈయన ఆనాడు ఈ మాట చెప్పారని ఈ మాటను తాను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా మరోసారి పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.