ఆర్మీ జవాన్ గురించి చాగంటి గారి అద్భుత ప్రవచనం (వీడియో)

తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురించి తెలియని వారుండరేమో. భగవంతుని నమ్మే ప్రతి భక్తుడు ఆయన ప్రవచనం ఒక్కసారైనా ప్రత్యక్షంగా వినాలని కోరుకోవడంలో అతిశయోక్తి లేదు. కళ్ళకి కట్టినట్టుగా ఆయన చేసే బోధలు ఎంతోమందిని ఆయన ప్రవచనాలవైపు ఆకర్షితుల్ని చేశాయి. రామాయణ, మహా భారతాలవంటి పురాణాలను ఆయన వర్ణించే విధానం ప్రత్యక్షంగా చూస్తున్నట్టే ఉంటుంది అంటారు శ్రోతలు. ఏదైనా పుణ్యక్షేత్రాల గురించి ఆయన చెబుతున్నప్పుడు ఆ క్షేత్రాలను దర్శనం చేసుకుంటున్న అనుభూతికి లోనవుతాము అంటుంటారు.

పురాణాలలో పాత్రల గురించి, గాధల గురించి వర్ణిస్తూ వాటిలోని ధర్మాన్ని మన దైనందిన జీవితాలలోకి ఎలా అన్వయించుకోవాలో వివరిస్తూ ఉంటారు. ఆయన ఏ ప్రవచనం చెప్పినా అందులో ఒక మెసేజ్ ఉంటుంది. అటువంటి వ్యక్తి ఒకసారి ఒక మిలిటరీ జవాన్ గురించి ఎంతో ఆవేదనతో ఒక ప్రవచనం చెప్పారు. మన మీడియా వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి.