ఏపికి కొత్త గవర్నర్ గా కేంద్రప్రభుత్వం బిశ్వ భూషణ్ హరిచందన్ ను నియమించింది. హరించదన్ ఒడిస్సాకు చెందిన సీనియర్ బిజెపి నేత. ఐదుసార్లు ఎంఎల్ఏగా వరుసగా ఎన్నికైన రికార్డుంది హరిచందన్ కు. సుమారు 83 ఏళ్ళ బిశ్వ భూషణ్ కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
పార్టీ తరపున ఒడిస్సా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా అయినా హరించదన్ పార్టీకి బాగా విధేయుడు. పైగా బిజెపిలోని చాలామంది సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్న వారు. అందుకనే హరించదన్ ను కేంద్రం ఏరికోరి గవర్నర్ గా నియమించింది.
హరిచందన్ నియామకంతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ తెలంగాణాకు మాత్రం పరిమితవుతారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకరే గవర్నర్ గా ఉంటే ఏదైనా సమస్యలు వచ్చినపుడు పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. అలా కాదని రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇద్దరు గవర్నర్లను నియమిస్తే ఎవరి రాష్ట్రం తరపున వారు కట్టుబడి ఉండే అవకాశాలున్నాయి.
సరే మొత్తానికి దేశంలోనే రికార్డు సృష్టించిన నరసింహన్ ప్రస్తుతం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితయ్యారు. యూపిఏ హయాంలో నియమితులైన నరసింహన్ ఎన్డీఏ హయాంలో కూడా దాదాపు 11 ఏళ్ళుగా కంటిన్యు అవ్వటమే రికార్డు.