అనుకున్నంతా అయ్యింది. చంద్రబాబునాయుడుకు ఎలక్షన్ కమీషన్ పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు ఎలాగైనా క్యాబినెట్ సమావేశం జరపాలని పంతం పట్టిన చంద్రబాబుకు సీఈసీ షాక్ ఇచ్చింది. క్యాబినెట్ జరపాల్సినంత అత్యవసర పరిస్ధితులేమీ లేవని సీఈసీ తేల్చేసింది. అందుకనే క్యాబినెట్ సమావేశం నిర్హణకు నో చెప్పింది. పైగా ఆ విషయాన్ని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణంతో నేరుగా చెప్పించింది.
ఎలక్షన్ కమీషన్ , ఎల్వీపై పంతంతో క్యాబినెట్ సమావేశానికి నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశానికి రాకపోతే బిజినెస్ రూల్సు ప్రచారం కఠిన చర్యలను తీసుకుంటానంటూ ఐఏఎస్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. దాంతో రాష్ట్రంలో చంద్రబాబు, ఐఏఎస్ అధికారుల మధ్య పరోక్ష యుద్ధం మొదలైనట్లుగా ప్రచారం ఊపందుకుంది.
నిజానికి మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెల్లడయ్యే సమయంలో చంద్రబాబుకు ఇదంతా అనవసరం. అసలు ఐఏఎస్ లతో గొడవ పెట్టుకునే రకం కూడా కాదు చంద్రబాబు. అలాంటిది ఓటమి భయంతోను, ఎల్వీపై వ్యక్తిగత కోపంతోనే పంతానికి పోయి చివరకు తల బొప్పి కట్టించుకున్నారు.
ఈరోజు ఉదయం చంద్రబాబును క్యాంపు ఆఫీసులో ఎల్వీ నేరుగా సమావేశం అయ్యారు. దాంతో అందరికీ అనుమానం వచ్చేసింది. అనుమానాలకు తగ్గట్లే క్యాబినెట్ సమావేశానికి సీఈసీ రెడ్ సిగ్నల్ ఇచ్చిన వషయాన్ని చంద్రబాబుతో చెప్పి ఎల్వీ బయటకు వచ్చేశారు. మరి చంద్రబాబు ఇపుడేం చేస్తారో చూడాల్సిందే.