వైస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ షాక్

CBI has issued a notice to former MLA Amanchi Krishna Mohan

న్యాయస్థానాలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే అభియోగాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నెల 6వ తేదీన విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ డీఎస్పీ ఆమంచికి నోటీసులు జారీ చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన సమయంలో ఏపీ హైకోర్టును, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగాలు ఆమంచిపై ఉన్నాయి. న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలంటూ పోస్టులు పెట్టారని కేసులు నమోదయ్యాయి.

CBI has issued a notice to former MLA Amanchi Krishna Mohan
CBI has issued a notice to former MLA Amanchi Krishna Mohan

ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పలువురిపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా దూషణలు చేసిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే.ఇప్పటికి 49 మందికి కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిలో అధికార వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు. కాగా, న్యాయమూర్తులను దూషించిన కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ సరిగా దర్యాప్తు చేయట్లేదని ఆగ్రహించిన హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో సీబీఐ.. వైసీపీ కీలక నేత ఆమంచికి నోటీసులు జారీ చేయడం విశేషం.