అమరావతి:రాజకీయాల్లో విజయం సాధించాలంటే మంచి పనులు చేయాలన్నది ఒక్కప్పటి సిద్ధాంతం కానీ మంచి పనులు చేయకపోయినా కులం పేరుతో గెలవొచ్చన్నది నేటి సిద్ధాంతం. కులం, మతం లేనిదే రాజకీయాలు లేవనేది ఒప్పుకోలేని నిజం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ కుల అసంతృప్తి ఇప్పుడు ఢిల్లీ దాకా చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయలన్ని కమ్మ, కాపు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో టీడీపీని ఇన్నిరోజులు భుజాన మోసింది కమ్మ కుల పెద్దలే.
ఇప్పుడు టీడీపీ రాజకీయ భవిష్యత్తు అంత ఉజ్వలంగా లేకపోవడం వల్ల కమ్మ నాయకులు తమను ఆదరించే వేరే పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబును సపోర్ట్ చేసిన నాయకులు లోకేష్ ను సపోర్ట్ చేయడానికిసిద్ధంగా లేరనే సుస్పష్టం. జగన్ తనకు అనుకూలంగా ఉన్న కమ్మ నాయకులను తన నీడలో ఉంచుకుంటున్నాడు కానీ పెత్తనం ఇవ్వడం లేదు. దీంతో కమ్మ నాయకులు తమకున్న ఏకైక మార్గమైన బీజేపీలోకి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు.
అయితే ఆల్రెడీ బీజేపీలో జనసేనకు చెందిన కాపు నాయకులు ఎక్కువగా ఉండటం వల్ల కమ్మ నాయకులు అందులోకి ఒక్కొక్కటిగా వెళ్ళడానికి వెనకడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న కాపు డామినేషన్ ను తట్టుకోవడం సాధ్యం కాబట్టి వెళ్ళడానికి జంకుతున్నారు. దీంతో కమ్మ నాయకులు అందరూ కలిసి ఒకేసారి బీజేపీలోకి వెళ్లి, పెత్తనం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయం పసిగట్టిన జనసేన కాపు నాయకులు కూడా వల్ల ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే అంతర్గతంగా ఏర్పడిన ఈ కుల రాజకీయాల వేడి ప్రధాని మోదీ వరకు వెళ్లిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నాయకుల పొరుపై కేంద్ర బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అలాగే వెళ్తున్న తన నాయకులను ఆపడానికి చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.