చంద్రబాబునాయుడు, లోకేష్ అధికార దుర్వినియోగానికి పాల్ప డుతున్నట్లు హై కోర్టులో కేసు వేశారు. వీరిద్దరితో పాటు ఏపిఎన్నార్జీ సీఈవో వేమూరి రవికుమార్ , మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి లపై కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది జాడ శ్రవణ్ కుమార్ కోర్టులో పిల్ వేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అర్హతలేని షెల్ కంపెనీలకు కోట్ల రూపాయలు విలువచేసే భూములు అప్పగించటంతో పాటు పెద్ద ఎత్తున రాయితీలు కూడా కల్పించినట్లు పిటీషనర్ ఆరోపించారు.
క్విడ్ ప్రో కో పద్దతిలో షెల్ కంపెనీలతో పై నలుగురు అవగాహన కుదుర్చుకుని కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నట్లు పిటీషనర్ ఆరోపించారు. పెట్టుబడులు పెడతామని వస్తున్న సంస్ధల నుండి చంద్రబాబు, లోకేష్ కు ముడుపులు అందిన తర్వాతే ఏపిఎన్నార్జీకి క్లియరెన్సులు ఇస్తున్నట్లు మండిపడ్డారు.
సరే చంద్రబాబునాయుడుపై కోర్టులు కేసులు వేసినంత మాత్రానా ఏదో అయిపోతుందని భ్రమపడే వారెవరూ లేరు. ఎందకంటే, ఇప్పటి వరకూ కోర్టుల్లో దశాబ్దాల తరబడి మూలుగుతున్న కేసుల గతేంటో అందరూ చూస్తున్నదే. కాబట్టి కొత్తగా కేసు వేస్తే ఏమవుతుంది ? అయితే డిస్మిస్ అయిపోతుంది. లేకపోతే ఇప్పటికే ఉన్న కేసుల్లో ఇది ఒకటవుతుందంతే. కాకపోతే మొన్నటి ధర్మాబాద్ కోర్టు వ్యవహారం చూసిన తర్వాత తాజాగా హై కోర్టులో దాఖలైన పిటీషన్ పైన కూడా ఏమన్నా కదలిక ఉంటుందా అని ప్రతిపక్షాలు ఎదరుచూస్తున్నాయ్.
ఇది కూడా చదవండి