అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రధం దగ్థంపై అధికార పక్షం- ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోన్న సంగతి తెలిసిందే. ఘటనకు కారణంగా టీడీపీ-వైసీపీ పార్టీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడీ ఈ ఘటన పూర్తిగా రాజకీయ రూపం మార్చుకుంది. ప్రమాదశత్తు ఘటన చోటుచేసుకుందా? పనిగట్టుకుని ఎవరైనా చేసారా? అన్నది పక్కనబెడితే టీడీపీ మాత్రం దీన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేయడం మొదలు పెట్టింది. ఘటనపై బీజేపీ-జనసేనలు స్పందించిన తీరు అర్ధవంతంగా ఉన్నా! టీడీపీ తీరు మాత్రం పైశాచికంగానే ఉందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇప్పటికే ఈ ఘటనని రాష్ర్ట ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. విచారించి నిగ్గు తేల్చాల్సిందిగా కేసును సీబీఐ చేతుల్లో పెట్టింది. వీలైనంత త్వరగా ఘటనకు సంబంధించి కారకులెవరో కనిపెట్టి శిక్షించాలని జనసేన-బీజేపీ లు సీబీఐని కోరాయి. అయితే టీడీపీ మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాత్రం ఏకంగా సీబీఐకే డెడ్ లైన్ విధించారు. రెండు నెలల్లో సీబీఐ విచారణ పూర్తిచేసి దోషులెవరో తేల్చాలని అల్టిమేటం ఇచ్చారు. రద్ధం గొప్పదనాన్ని వివరిస్తూ…భక్తుల మనోభావాల గురించి చింతించారు. అలాగే ఏడాది కాలంలో హిందు దేవాలయాలపై జరిగిన దాడులన్నింటిపై నా సీబీఐ విచారణ చేసి నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసారు.
అయితే సీబీఐకే అల్టిమేటం ఇవ్వడంపైనే సోషల్ మీడియాలో జోకులు పేల్తున్నాయి. గతంలోనూ పలు ఘటనలపై టీడీపీ నేతలు ఇలాగే రియాక్ట్ అయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఓవర్ ఎక్స్ ఫోజ్ అయ్యే ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు అదే పని చిన రాజప్ప చేయడం గమనార్హం. ఇక ఘటనకు సంబంధించి మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగా వినిపించింది. ఆ తర్వాత మతిస్థిమితం లేని వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఆ రెండింటి తర్వాత తెనెతట్టు కోసం పొగ పెట్టినట్లు ప్రచారం సాగింది. మరి సీబీఐ విచారణలో ఎలాంటి కారణం బయటకు వస్తుందో.