జగన్ దాడిపై నిందితుడి సోదరుడు చెప్పిన షాకింగ్ విషయాలు (వీడియో)

వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ అన్న సుబ్బరాజు దాడి పై స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం మండలం టానెలంక  శ్రీనివాస్ స్వస్థలం.

 ‘నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్ కు అభిమాని. ఎలాంటి గొడవలు కూడా పడేవాడు కాదు. ఎలాంటి నేర చరిత్ర లేదు. జగన్ పై నా తమ్ముడు దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నాం. సెల్ఫీ దిగుతానని చెప్పి, దాడి చేసినట్టు టీవీలో చూశాం. నా తమ్ముడు 10 వ తరగతి చదివి, ఆ తర్వాత ఐటీఐ చేశాడు’ అని చెప్పాడు. సుబ్బరాజు మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.