బావ కోసం బావమరిది త్యాగం ?

తాజాగా రిలీజ్ అయిన ఎన్టీయార్ బయోపిక్ మహానాయకుడు సినిమా చూసిన తర్వాత అందరిలోను ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఎన్టీయార్ రాజకీయ జీవితంలో అతిపెద్ద విలన్ ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పేస్తారు చంద్రబాబునాయుడే అని. పిలిచి పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి సిఎం కుర్చీని లాక్కున ఘనుడు చంద్రబాబు. అఫ్ కోర్సు ఎన్టీయార్ కుటుంబసభ్యులు మొత్తం అందుకు సహకరించారనుకోండి అది వేరే సంగతి. అలాంటిది ఎన్టీయార్ బయోపిక్ అనగనే అందరికీ గుర్తుకొచ్చేది మొదటిసారి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటైతే తర్వాత గుర్తుకొచ్చేది చంద్రన్న పోటే.

అలాంటిది బయోపిక్ రెండో భాగంలో కేవలం నాదెండ్ల వెన్నుపోటును మాత్రమే చూపారు. అంటే చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ ను బావమరిది కమ్ వియ్యంకుడు బాలకృష్ణ చూపిస్తాడని కూడా ఎవరూ అనుకోలేదు లేండి. చంద్రబాబు పాత్రను వేసిన రానా దగ్గుబాటి షూటింగ్ కు ముందే చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఇక చంద్రబాబు వెన్నుపోటు ఉంటుందని ఎవరూ అనుకోలేదు కూడా. అందరూ అనుకున్నట్లుగానే చంద్రబాబు పాత్రను హీరోగా ఎలివేట్ చేసి ఎన్టీయార్ పాత్రకు అన్యాయం చేశారన్నది ప్రేక్షకుల టాక్.

ఎన్టీయార్ బయోపిక్ తీసి ఎన్నికలకు ముందు రిలీజ్ చేసిందే చంద్రబాబును హారోగా చూపించేందుకన్న విషయం అందరికీ తెలిసిందే.  తండ్రి పాత్ర హీరోయిజాన్ని తగ్గించేసి కేవలం చంద్రబాబునే గొప్పగా చూపించటంలో బాలయ్య గొప్ప త్యాగం చేసినట్లే అనుకోవాలి. అందుకనే మొదటిపార్టు లాగే రెండో పార్టు కూడా జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేదు. అందుకే రెండో పార్టును ప్రమోట్ చేసే బాధ్యతను చంద్రబాబే స్వయంగా భుజానికెత్తుకున్నారు. బాలయ్య తీసిన బయోపిక్ పై ముందు నుండే అంచనాలునండబట్టే రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీయార్ బయోపిక్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.