ముద్రగడ, చిరంజీవితో బీజేపీ… పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ఇప్పటికే రసవత్తరంగా మారిన ఏపీ రాజకీయాల్లోకి బీజేపీ కూడా ఎంటరైపోతోంది. ఇందులో భాగంగా ఈసారి ఏపీలో కూడా ఉనికి చాటాలనుకుంటుంది. అటు అసెంబ్లీలోనూ, ఇటు పార్లమెంట్ లోనూ ఏపీ బీజేపీ నేతలు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటుంది. ఈ సమయంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు కదులుతుంది. ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుందు.

ఏపీ రాజకీయాల్లో తన ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని భవిస్తున్న బీజేపీ.. అక్కడ కూడా ఎంతోకొంత సత్తా చాటాలని భావిస్తుంది. పవన్ ఆల్ మోస్ట్ హ్యాండ్ ఇచ్చినట్లే అనే సంకేతాలు వస్తున్న సమయంలో ముద్రగడ, చిరంజీవిలను రంగంలోకి దించుతుందని తెలుస్తుంది! వాస్తవానికి కాపు ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఏపీలో పవన్ తో దోస్తీ చేసింది బీజేపీ. చంద్రబాబుని సైతం పక్కనపెట్టింది.. పవన్ ను ఎన్డీయేలో ప్రాతినిధ్యం కల్పించింది.

అయితే… కారణం ఏదైనప్పటికీ పవన్ మాత్రం చంద్రబాబు వెంట నడవడం మొదలుపెట్టారు. టీడీపీతో పొత్తు కన్ ఫాం అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాట్లు గరం గరంగా సాగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లోకి బీజేపీ ఎంట్రీ ఇస్తుంది. కాపు ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముద్రగడకు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.

అవును… ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరబోతున్నారని.. పవన్ కల్యాణ్ నేరుగా కిర్లంపూడి వెళ్లి ఆయనను పార్టీలో ఆహ్వానిస్తారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే… ఆ ప్రోగ్రం పోస్ట్ పోన్ అవ్వడానికి బీజేపీ ఎంట్రీనే కారణం అని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ పెద్దలు ముద్రగడతో మాట్లాడారని.. కీలక బాధ్యతలు అప్పగించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో చిరంజీవి విషయంలో కూడా బీజేపీ వ్యూహం సిద్ధం చేసిందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా తాజాగా చిరంజీవిని పద్మ అవార్డులకు ఎంపిక చేసిన కేంద్రం.. ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా… కాపు ఓట్లలో తన ముద్ర వేయాలని భావిస్తుందని తెలుస్తుంది. ఇదే సమయంలో… తెలంగాణలో బీసీ సీఎం అన్నట్లుగానే… ఏపీలో కాపు సీఎం నినాదంతో ముందుకు కదిలే అవకాశాలున్నాయని సమాచారం.

దీంతో… ఈ విషయం పవన్ కు పెద్ద షాకే అని… ఇప్పుడు చంద్ర్బాబుతో వెళ్తారా.. లేక, కాపు సీఎం నినాదానికి మద్దతిస్తారా అనేది వేచి చూడాలి!! కాగా… టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే!!