వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయంలో పవన్ ఒంటరైపోయారని అంటున్నారు. కారణం… వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, వారి సేవలు పొందుతున్న ప్రజానికం మొత్తం ఒకవైపు నిలబడగా… పవన్ ఒక్కరే ఒకవైపు నిలబడ్డారు!
ఈ సమయంలో వైసీపీ నేతలు పవన్ కు ఊపిరాడనివ్వకుండా వాయించి వదులుతున్నారు! పవన్ స్థాయిని గుర్తుచేస్తూ ఎద్దేవా చేస్తున్నారు! పవన్ విజ్ఞతపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు! పవన్ సంస్కారంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు! ఈ సమయంలో చంద్రబాబు తలుపు చాటున నక్కి తతంగం అంతా చూస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సమయంలో బీజేపీ తెరపైకి వచ్చింది.
టీడీపీతో జనసేన అధికారికంగా పొత్తులో లేదు! కాకపోతే వారిది పొత్తు బంధం కాదు.. ప్యాకేజీ బంధం అని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. అయితే ప్యాకేజీ ఇచ్చిన చంద్రబాబు తలుపు చాటున నక్కి ఏమి జరుగుతుందో చూస్తూ, పవన్ గాలి ఎలా పోతుందో గమనిస్తుంటే… నిజమైన మిత్రబంధంగా ఉన్న బీజేపీ మాత్రం పవన్ కు మద్దతుగా నిలిచిందని తెలుస్తుంది.
అవును… పొత్తులో ఉన్నా లేనట్టే అన్నట్లుగా పవన్.. బీజేపీ విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించేవారని అంటుంటారు. బాబు అండ చూసుకుని బీజేపీ నేతలను లైట్ తీసుకునేవారనే విమర్శ ఉందని చెబుతుంటారు. పొత్తులో ఉన్న వారిని కాదని.. ప్యాకేజీ మాయలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశారనే అపవాదు కూడా పవన్ పై ఉంది. అయినా కూడా బీజేపీ నేతలు తమ మిత్రధర్మాన్ని వదలలేదని తెలుస్తుంది. అందులో భాగంగా పవన్ కు మద్దతుగా నిలిచారని తెలుస్తుంది.
తాజా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. తాము గతంలో కూడా ఈ డిమాండ్ చేశామని, ఇప్పుడు మరోసారి చెబుతున్నామని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని, కేవలం వైసీపీ లబ్ధికోసమే దాన్ని ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు. వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్థావించకపోయినా… పవన్ కు తమ వంతుగా నిలబడ్డారు!
దీంతో… చంద్రబాబుపై ఈగ వాలినా కూడా మైకులముందుకొచ్చి లబో దిబో మనే పవన్… బీజేపీని చూసి, వారి మిత్ర ధర్మాన్ని చూసి సిగ్గుతో తలదించుకోవాలని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇంతజరుగుతున్నా… తలుపు చాటున నక్కిన ప్యాకేజీ మిత్రుడి కంటే… వారివల్ల కాకపోయినా కష్టకాలంలో అండగా ఉన్న బీజేపీ మిత్రధర్మమే గొప్పదని వారు పోస్టులు పెడుతున్నారని తెలుస్తుంది.
అయినా కూడా… ప్యాకేజీ ధర్మాన్ని, మిత్రధర్మం దాటే ఛాన్స్ లేదని అంటున్నారు విశ్లేషకులు!