బీజేపీకి వైసీపీ, టీడీపీలు లొంగినా జనం లొంగరు కదా.. 

BJP should face peoples angry  
కేంద్ర బీజేపీ నాయకత్వం ఆడుతున్న డబుల్ గేమ్ రాష్ట్ర బీజేపీ శాఖకు పెను శాపంలా మారుతోంది.  వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్న ఆ పార్టీకి హైకమాండ్ తీరే గొడ్డలిపెట్టుగా మారుతోంది.  విభజన హామీల్లోని ప్రధాన అంశాలైన ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్, కడప ఉక్కు ప్లాంట్ లాంటి వాటినీ గాలికొదిలేశారు.  ఇక్కడేమో మేం అడుగుతూనే ఉన్నాం అంటూ కాసేపు, ఇక హోదా రాదని కాసేపు టైమ్ పాస్ చేస్తున్నారు రాష్ట్ర నాయకులు.  ఇవి చూసి చూసి జనానికి విసుగొచ్చేసింది.  సోము వీర్రాజు కొత్త అధ్యక్షుడు అయ్యాక ఏదో కొంత హడావుడి చేసినా మళ్ళీ పాత పాటే అందుకున్నారు.  ప్రతిదానికీ కేంద్రం వైపు చూడటం పరిపాటి అయిపోయింది.  సొంత నిర్ణయాలు అసలే లేవు. 
 
BJP should face peoples angry
 
విభజన హామీలైన ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ లాంటివి ఇప్పటికీ లేవు.  వాటి మీద ప్రశ్నిస్తే అదిగి ఇదిగో అనడం, కేంద్రం మీదకు తోసెయ్యడం మినహా రాష్ట్ర నాయకులు చేయగలిగింది ఏమీ లేదు.  ఒక దశలో అంతర్వేది రథం దగ్ధం వివాదాన్ని మత ప్రస్తావనతో పెద్దది చేసి మైలేజ్ పొందాలని అనుకున్నారు.  ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు.  ప్రభుత్వం సైతం కేసును సీబీఐకి అప్పగించింది.  కానీ ఇప్పటికీ అందులో పురోగతి లేదు.  దీంతో తిరిగి తిరిగి అది బీజేపీ నెత్తి మీదే పడింది.  ఇప్పటికీ సమాధానం చెప్పుకోలేక నలిగిపోతున్నారు.  ప్రతిపక్షం టీడీపీ వెనక్కి నెట్టేసి వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామన్న బీజేపీ గొప్పలు గొప్పలుగానే మిగిలిపోనున్నాయి తప్ప ఏ కోశానా నెరవేరేలా లేవు. 
 
 
ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అయితే బీజేపీ మీదే అందరి గురి ఉంది.  మిత్రపక్షంగా జననసేన తరపున పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి పెద్దలను కల్సి కనీసం ప్రైవేటీకరణను ఆపమని కేంద్రం పెద్దలకు విజ్ఞప్తి చేసుకుని వచ్చారు.  అయితే సోము వీర్రాజుకు ఆ వెసులుబాటు కూడ లేదు.  అధికార వైసీపీని కేంద్రం కంట్రోల్లో పెట్టుకున్నా టీడీపీ తన అవసరం కొద్దీ మోడీ సర్కారును టచ్ చేయకపోతున్నా జనం విషయం వేరు కదా.  అందుకే రాష్ట్ర బీజేపీ శాఖను నిలదీస్తున్నారు.  మీరే కదా పైన అధికారంలో ఉంది.  ఏం మంచి చేస్తున్నారు రాష్ట్రానికి అంటూ మండిపడుతున్నారు.  ఇప్పటీకే ఈ ఎఫెక్ట్ పంచాయతీ ఎన్నికల్లో కనబడింది.  బీజేపీ అడ్రెస్ లేకుండా పోయింది.  వచ్చే ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఇంకా బలంగా కనబడేలా ఉంది.  ఈసారి నోటాతో పోల్చడానికి వీల్లేని ఓట్ల శాతంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందేమో.