ఓపెన్ అయిపోయారు… టీడీపీ అధికార ప్రతినిథిగా పురందేశ్వరి?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటూ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ – టీడీపీ మధ్యలో జనసేన అనే డిఫరెంట్ టైప్ పొతు రాజకీయం కూడా నడుస్తుంది! ఈ సమయంలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కోసం… ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె ఓపెన్ అయిపోయినట్లు కనిపిస్తున్నారు!!

తాజాగా చంద్రబాబునాయుడికి మద్దతుగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తన ముసుగును తీసేశారని అంటున్నారు విశ్లేషకులు. ఇంతకాలం ఏదో మొహమాటం కొద్ది ముసుగులోనే మద్దతు పలికినప్పటికీ… ఇప్పుడు పూర్తిగా ఓపేన్ అయిపోయినట్లు తెలుస్తుంది.

దీంతో… బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అనే ముసుగును తీసేసి అచ్చంగా చంద్రబాబు అభిమానిగా మాట్లాడుతున్నారని అంటున్నారు. దీంతో… టీడీపీ అధికార ప్రతినిథిలా పురందేశ్వరి మారిపోయారని… ములాకత్ లో ఉన్న మాయేంటో అర్ధం కావడం లేదని చెబుతున్నారు. కారణం… ములాకత్ తర్వాతే పవన్ కూడా ఓపెన్ అయిపోయారు.

ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైతే… అసలు అది స్కామా కాదా.. అంద్లో అవినీతి జరిగిందా లేదా అనే విషయం పక్కన పెట్టిన పురందేశ్వరి… రాష్ట్ర బడ్జెట్లో మద్యం అమ్మకాల ద్వారా స్కాం జరుగుతుంది, దానితో పోలిస్తే ఇది చిన్నది అన్నట్లుగా మాట్లాడరని తెలుస్తుంది.

ఏపీలో మధ్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రూ.20 వేల కోట్లని చెప్పారు.. కానీ నిజానికి వస్తోన్న ఆదాయం రూ.56,700 కోట్లు అని అంటున్నారు పురందేశ్వరి. ఇలా, మొత్తం ఆదాయంలో బడ్జెట్లో చూపుతున్న రూ.20 వేల కోట్లను తీసేస్తే మిగిలిన రూ.36,700 కోట్లు ఎటు వెళుతున్నాయన్నది పురందేశ్వరి ప్రశ్న.

అంటే పరోక్షంగా పురందేశ్వరి చెప్పిందేమిటంటే రూ.36,700 కోట్ల భారీ కుంభకోణం జరుగుతోందని. అనంతరం ఈ కుంభకోణంపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… చంద్రబాబుని వెనకేసుకు రావాలనే తాపత్రయంలో ఆమె ఏపీ బీజేపీ చీఫ్ అనే విషయాన్ని మరిచిపోతున్నట్లున్నారు.

ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలు. హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లి, ఏపీలో అవినీతి జరుగుతుందని చెప్పి సీబీఐ ఎంక్వైరీ వేయించడం ఆమె స్థాయికి చాలా చిన్న విషయం. అయితే… అందుకు మాత్రం పురందేశ్వరి సిద్ధంగా లేరు. కారణం… తీరా విచారణ అంతా జరిగిన తర్వాత స్కాం జరగలేదని తెలిస్తే… కేంద్రంలోని పెద్దలు ఆమెకు మొట్టికాయలు వేసే ఛాన్స్ ఉంది!

దీంతో… అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న ఆమె కూడా… సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఆమె చేయాల్సింది డిమాండ్ కాదు… విచారణ! దీంతో మరిది కోసం కాస్త గట్టిగానే నిలబడుతున్నట్లున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికలనాటికి కేంద్రంలోని పెద్దలు టీడీపీతో పొత్తుకు అంగీకరించని పక్షంలో ఆమె బీజేపీకి రాజినామా చేసి, టీడీపీలో చేరిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు!