బీజేపీ ట్రేడ్ మార్క్ రాజకీయాల్లో వాడకం కూడ ఒకటి. ఒకరు పార్టీకి ఉపయోగపడతారు అనుకుంటే అస్సలు విడిచిపెట్టరు మోడీ. ఏపీలో బీజేపీ పరిస్థితు ఎంత అద్వాన స్థితిలో ఉంది అందరికీ తెలుసు. ఆ అద్వానపు స్థితి నుండి బయటపడటానికి. బలం పుంజుకోవడానికి చేయూతనిచ్చే ఒకరు కావలి. అందుకే గత ఎన్నికల్లో తెలుగుదేశంతో దోస్తీ చేశారు. ఆ దోస్తీలో పవన్ వంతు కూడ ఉంది. కానీ చంద్రబాబుతో స్నేహం 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెగిపోయింది. టీడీపీని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటే బాబుగారు అన్నీ గ్రహించి మిడిల్ డ్రాప్ అయ్యారు. డ్రాప్ అవడమే కాదు బీజేపీ మీద అటాక్ కూడ చేశారు. మోడీ, అమిత్ షాలను పక్క రాష్ట్రం వెళ్లి తిట్టేసి వచ్చారు. అందుకే ఇప్పుడు కలుస్తానంటున్నా బీజేపీ చేరనీయట్లేదు.
అందుకే ఏపీలో మరొక మార్గం కోసం వెతుకుంటూ పవన్ మీద వల వేసింది. పవన్ కు కూడ మోడీ నాయకత్వం అంటే గౌరవం ఉంది. అలాంటి వ్యక్తే కలిసి పనిచేద్దాం అన్నప్పుడు కాదనలేక ఒప్పుకున్నాడు. వీరు దోస్తీని ప్రకటించగానే ఇదేదో తేడా కొట్టే వ్యవహారమని అందరికీ అర్థమైంది. చివరికి జనసేన కార్యజర్తలు సైతం బీజేపీ స్నేహం ఏంటి అనుకున్నారు. కేంద్రంలో వైసీపీతో అనధికారిక ఒప్పందంతో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సరికాదని సూచించారు. కానీ పవన్ ఒక్కసారి మాటిస్తే వెనక్కు తగ్గరు కదా. అందుకే ముందుకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆ దారిలో అన్నీ గోతులే కనబడుతున్నాయి.
బీజేపీ అంటే రెండు నాల్కల ధోరణికి అలవాటు పడింది కాబట్టి ఢిల్లీలో జగన్, మోదీ భాయి భాయి అంటే రాష్ట్రంలో సోము వీర్రాజు పాలక పక్షం మీద ఏదో నామమాత్రపు విమర్శలు, పోరాటాలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారు. తెలంగాణలో కూడ ప్రభావితం చేసి జనసేనను పోటీ నుండి విరమించుకునేలా చేశారు. ఇక తిరుపతి ఉపఎన్నికల్లో కూడ వాళ్లకి వాళ్ళే పోటీలో ఉండబోయేది బీజేపీ అభ్యర్థి అని ప్రకటించుకున్నారు. కానీ ఇంతలో పవన్ తేరుకుని అడ్డం తిరిగాడు. లేదంటే ఈపాటికి బీజేపీ అభ్యర్థి ప్రచారంలోకి దిగేసి ఉండేవాడే.
ఇక దేవాలయాలు, దేవుళ్ళ వివాదాల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు కూడ పవన్ కు నచ్చట్లేదు. రథయాత్రలో పాలోనేది లేదని చెప్పేశారు. అంటే ధిక్కరణ ధోరణిలోనే ఉన్నారు. వీటన్నింటినీ బీజేపీ హైకమాండ్ చూస్తూనే ఉంది. బయటకి నవ్వుతున్నా టైం చూసి పవన్ ను తొక్కిపెట్టాలని చూస్తున్నారు. పోరపాటున వారి చేతుల్లో గనుక పవన్ ఇరుక్కుపోతే చివరకు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం మినహా ఏమీ చేయలేరు.