పవన్ మాత్రమే కాదు చిరంజీవి కూడా కావాలా.. బీజేపీ ప్లాన్ ఇదేనా?

Pawan Kalyan talks about Prajarajyam and Chiranjeevi

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తుండగా అందులో భాగంగా ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన పొత్తు కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బీజేపీని కాదని పవన్ కళ్యాణ్ మరో పార్టీతో కలిసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం లేదు.

మోదీ సపోర్ట్ ఉండాలంటే బీజేపీతో కలిసి పోటీ చేయడం మినహా పవన్ కళ్యాణ్ కు మరో ఆప్షన్ లేదనే సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి సపోర్ట్ ను కూడా ఆశిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా చిరంజీవి సపోర్ట్ ఉంటే ఏపీలో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. చిరంజీవి సపోర్ట్ కోసం బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చిరంజీవికి తాజాగా అవార్డ్ రావడం వెనుక కూడా అసలు కారణం ఇదేనని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

మోదీ సైతం పలు సందర్భాల్లో చిరంజీవి గురించి పాజిటివ్ గా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతల ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం చిరంజీవి మద్దతు తమ పార్టీకి ఉంటే మంచిదని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే చిరంజీవి మాత్రం అందరివాడు అనిపించుకోవడానికి కష్టపడుతున్నారు. పవన్ ద్వారానే చిరంజీవిని బీజేపీలో యాక్టివ్ అయ్యేలా చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.