‘ఆపరేషన్ మెగాస్టార్’ – బీజేపీ సరికొత్త వ్యూహం
ఇటీవలే జరిగిన తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో అందరి అంచనాలని తారుమారు చేసి బీజేపీ అనూహ్యమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయానికి మొదటి కారణం కెసిఆర్ పాలనా పై ప్రజలలో పెరిగిన అసంతృప్తి కాగా, రెండో కారణం అమిత్ షా వేసిన ప్రణాళికగా చెప్పుకోవచ్చు. బీజేపీ కి తెలంగాణ లో పెద్దగా పట్టు లేనప్పటికి, ఉత్తర తెలంగాణలో కవితను సైతం ఓడించి విజయం సాధించడం చిన్న విషయం కాదు.
తెలంగాణ లో సాదించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లోను తమ పార్టీ గుర్తింపుని విస్తరించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ లోని ఎమ్మెల్యేలను ఆకర్షించడం మొదలుపెట్టింది. బీజేపీ లోకి చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, తమ పార్టీని ముందుండి నడిపే మాస్ లీడర్ కొరత కాషాయం పార్టీని వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ లీడర్ గా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ వర్గంలో వినికిడి.
రాష్ట్ర విభజన తరువాత, కాంగ్రెస్ పార్టీ లో ఉన్న లేనట్టుగా చిరంజీవి క్రియారాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో కనీసం పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ’ వైపు కూడా చూడని చిరు..ఇప్పుడు బీజేపీ వైపు ఎందుకు మొగ్గుతారనే వాదన సోషల్ మీడియా లో హాట్ డిబేట్ గా మారింది. కాగా, బీజేపీ లో చేరి తమ్ముడుతో దూరాన్ని పెంచుకునే నిర్ణయం మెగాస్టార్ తీస్కునే అవకాశం లేదని రాజకీయవిశ్లేషకుల అంచనా.