బ్రేకింగ్ : చిరు పై చేసిన వ్యాఖ్యలకి క్లారిటీ ఇచ్చిన సిపిఐ నారాయణ.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల జీవిత కాలంలో చూడని అంశం లేకపోవచ్చు. అయితే ఒక నాణేనికి రెండు వైపులా అన్నట్టు చిరు పై మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే వేరే ఇతర అభిప్రాయాలూ ఉన్న వారు కూడా ఉన్నారు.

అయితే చిరు కాస్త మెత్తని మనిషి అని తనను ఎవరు ఏమన్నా కూడా పెద్దగా స్పందించరు, క్షమాగుణం ఎక్కువ అని ఇండస్ట్రీ ప్రజలు అంటారు. కానీ చిరు సైలెంట్ అవ్వొచ్చు కానీ తన అభిమాన జనం మాత్రం మెగాస్టార్ ని ఎవరైనా ఏమన్నా అంటే దానికి సమాధానం మాత్రం గట్టిగానే చెబుతారు.

మరి తాజాగా ఇలాంటి ఒక సంచలన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో మరియు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఏపీలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు సిపిఐ పార్టీ కార్యదర్శి అయినటువంటి సిపిఐ నారాయణ గత రెండు రోజులు కితం చిరంజీవిపై పలు ఊహించని వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.

దీనితో మెగా ఫ్యాన్స్ సహా చిరు  ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ నారాయణ చిరు కి క్షమాపణ చెప్పి తీరాలని ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని గట్టిగా చెప్పారు. దీనితో ఇప్పుడు నారాయణ మీడియా ముఖంగా మెగాస్టార్ కి క్షమాపణ చెప్పడం జరిగింది.

చిరుపై తాను భాషా దోషం వల్ల అలా కామెంట్స్ చేసానని ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని మెగా ఫ్యాన్స్ కాపు నాడు వర్గాల వారు ఇది ఇంతటితో మర్చిపోవాలని కోరారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.