బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో కొడితే ఆంధ్రాలో వైసీపీ అదిరిపోయింది ?

Big changes happening in Srisailam
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకించి చూపాల్సిన పని లేదు.  బీజేపీ హిందూత్వవాద నినాదాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి ఆయన.  ఎక్కడైనా హిందూ ధర్మాలకు భంగం కలుగుతోంది అంటే వెంటనే స్పందిస్తారు.  అది తెలంగాణనా లేకపోతె వేరొక రాష్ట్రంగా అనేది చూడరు.  ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మతపరమైన వివాదాలకు స్పందించి అవతలివారికి  ముచ్చెమటలు పట్టించిన రాజాసింగ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ మీద గురిపెట్టారు.  శ్రీరైలం పుణ్యంక్షేత్రంలో అన్యమతస్తుల హవా ఎక్కువైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన.  శ్రీశైలం క్షేత్రంలో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తాత్కాలిక కాంట్రాక్టు ముగిసిన దుకాణాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా తొలగించలేదని దీని వెనక కర్నూల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.  
 
Big changes happening in Srisailam
Big changes happening in Srisailam
శ్రీశైలం దేవస్థానంలోని దుకాణాలను నిబంధనలకు విరుద్దంగా చక్రపాణిరెడ్డి ముస్లింలకు కట్టబెట్టారని, ఆయన చొరవతోనే దేవస్థానంలో ముస్లింల పెత్తనం పెరిగిపోయిందని, ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయమని అన్నారు.   రాజాసింగ్  మాటలతో శ్రీశైలం బీజేపీ శ్రేణులు గట్టిగా గొంతు కలిపాయి. దీనికి శిల్ప చక్రపాణిరెడ్డి కూడ ధీటుగానే స్పందించారు.  నాపై ఆరోపణలు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా ? హిందూత్వాన్ని అడ్డంపెట్టుకొని ఏపీలో ఎదగాలని బీజేపీ చూస్తోంది.  40 ఏళ్లుగా శ్రీశైలంలో ముస్లింలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. రజాక్ అనే వ్యక్తి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు.  నేను 9 ఏళ్ల నుంచి మాత్రమే ఉన్నా.  ఆయన పార్టీ కార్యకర్త మాత్రమే.  అవనసర ఆరోపణలు చేస్తే మర్యాద దక్కదు’ అన్నారు.  దీంతో రాజాసింగ్ శ్రీశైలం రావాలని నిర్ణయించుకున్నారు.  
 
అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ రాజాసింగ్ శ్రీశైలం రాకుండానే అక్కడి పరిస్థితులూ పెను మార్పులు కనిపిస్తున్నాయి.  కొద్దిరోజుల క్రితమే 8 మంది ముస్లిం ఉద్యోగులను ఆలయ విధుల నుండి తొలగించారు.  తాజాగా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కాలపరిమితి ముగిసినా నడుస్తున్న ముస్లింలకు చెందిన కొన్ని దుకాణాలను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.  అంతేకాదు ఆలయంలోని వివిధ కాంట్రాక్టుల్లో ఎక్కువ భాగం ముస్లింలే నిర్వహిస్తున్నారని వచ్చిన ఆరోపణల విషయంలో కూడ చర్చలు జరుగుతున్నాయట.  త్వరలోనే ఈ అంశంలో సైతం మార్పులు జరగవచ్చని చెబుతున్నారు.  మొత్తానికి రాజాసింగ్  హైదరాబాద్లోనే కూర్చొని శ్రీశైలంలో వైసీపీకి చెమటలు పట్టించారని, ఆయన కలుగజేసుకోబట్టే ఈ మార్పు జరుగుతున్నాయని అనుకుంటున్నారు స్థానిక భక్త జనం.