ప్రత్యక్ష రాజకీయాల్లోకి బ్రాహ్మణి, భువనేశ్వరి.!

దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె ఆమె. ఆ ఎన్టీయార్ మనవరాలు ఇంకొకామె.! ఒకరేమో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి.! ఇంకొకరేమో, మాజీ మంత్రి నారా లోకేష్ సతీమణి. ఆ ఇద్దరూ భువనేశ్వరి, బ్రాహ్మణి.!

ట్రాక్ రికార్డ్ చూసుకుంటే, రాజకీయాలు.. ఆపై వ్యాపారాలు.. వాళ్ళ బ్లడ్డులోనే వున్నాయ్.! కేవలం, వ్యాపార కార్యకలాపాలకే ఇప్పటిదాకా పరిమితమైన ఆ అత్తా కోడళ్ళు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం తప్పకపోవచ్చు.

ముందస్తు ఎన్నికల హంగామా నడుస్తోంది. ఈలోగా చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకపోతే.? నారా లోకేష్ కూడా జైలుకే పరిమితమయ్యే పరిస్థితి వస్తే. చంద్రబాబుకి బదులుగా భువనేశ్వరి, లోకేష్‌కి బదులుగా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిందేనేమో.!

కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ చేస్తారనీ, రాజమండ్రి నుంచి బ్రాహ్మణి పోటీ చేయొచ్చనీ ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది. అదేంటీ, మంగళగిరి నుంచి కదా బ్రాహ్మణి పోటీ చేయాలి.? అంటే, చంద్రబాబు వున్నది రాజమండ్రి జైలులో గనుక, అక్కడ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందట.

అప్పుడే, టీడీపీ శ్రేణులు నారా భువనేశ్వరినీ, నారా బ్రాహ్మణినీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థులుగా ప్రచారం చేయడం మొదలు పెట్టేశాయ్. అయితే, చంద్రబాబు ఖచ్చితంగా జైలు నుంచి విడుదలవుతారనీ, ఆయనే ఎన్నికల బరిలో వుంటారనీ టీడీపీ నేతలు చెబుతున్నారు.

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చంద్రబాబు స్కెచ్ వేస్తే, భువనేశ్వరి అలాగే బ్రాహ్మణి.. ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమే.