వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాతో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కారణంగా సోషల్ మీడియలో పవన్ అభిమానులు, వర్మ అభిమానులు మధ్య పరస్పరం మాటల యుద్ధం జరిగింది. అయితే ఎవరెన్ని అనుకున్నా వర్మ మాత్రం ఎప్పటిలాగానే సినిమాను రిలీజ్ చేసి తన పంథా నెగ్గించుకున్నాడు. అయితే ఈ సినిమాలో వర్మ ముందుగా చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గురుంచి పెద్దగా నెగిటివ్ ఏమీ చూపించలేదనే చెప్పాలి. ఎన్నికల తరువాత పవన్‌ను కలిసిన వారిలో పలు క్యారెక్టర్లను చూపించిన వర్మ బండ్ల గణేష్ పాత్రను కూడా చూపించాడు.
పరుగు పరుగున వచ్చి పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నట్టు సినిమాలో ఒక సీన్ క్రియేట్ చేశారు. అయితే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్యారెక్టర్‌పై స్పందించిన బండ్ల గణేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్‌స్టార్ ట్రైలర్‌లో తన పాత్ర చూసినప్పుడు ఫీల్ అయ్యానని, నా పాత్రపై మాట్లాడలని అనుకున్నా కరోనా వలన తనలో వచ్చిన మార్పు కారణంగానే సైలెంట్‌గా ఉన్నట్టు తెలిపారు. కానీ తన క్యారెక్టర్‌పై ఓ పిట్ట కథ చెబుతూ తాను ఏమీ చెప్పదలుచుకున్నాడో చెప్పకనే వచ్చాడు. తన ఊరిలో తన చిన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అంటూ.. వారణాసిలో చదువుకుని వచ్చిన ఒకాయనకు తమ ఊరిలో అందరూ గౌరవం ఇచ్చేవారని, ఏమైందో తెలీదు కొద్ది రోజులకు ఆయన పిచ్చివాడు అయ్యాడని అప్పటి నుంచి గౌరవించిన వారంతా అతడిని పట్టించుకోవడం మానేశారని ఎందుకంటే అతను పిచ్చివాడని జాలి చూపే వారని అన్నారు.
అయితే వర్మ విషయంలో తాను కూడా అలా అనుకునే సైలెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. పిచ్చి పనుల వెనుక ఆయన వర్మకి, సంతృప్తి, తృఫ్తి ఉందని అలాంటప్పుడు మనం ఎందుకు మాట్లాడడం అని అన్నారు. అయితే తన క్యారెక్టర్ వాడుకోవడం వలన వర్మ గారికి వంద రూపాయలు వచ్చినా తనకు హ్యాపీనే అని అన్నారు. అయితే ఎప్పటికైనా వర్మ లాంటి వారు పిచ్చి బాగా ముదిరి తల పగలి చచ్చిపోవడం ఖాయమని తేల్చేశారు.