సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. రాజకీయ నాయకుడు కూడా.! పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.! కాదు కాదు, భక్తుడు.! పవన్ కళ్యాణ్‌ని ‘దేవర’ అని పిలుస్తుంటాడు. జనసేన పార్టీలో చేరాడా.? అంటే, చేరాడేమో.! ఏమో ఏంటి.. అదంతే.!
వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణకి బండ్ల గణేష్ అత్యంత సన్నిహితుడు.! బొత్స బినామీ.. అంటూ బండ్ల గణేష్ గురించి సినీ, రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంటాయి.. అది కొత్త విషయమేమీ కాదు.!
ఇక, ఒకప్పటి టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ నేత సీఎం రమేష్‌కి కూడా అత్యంత సన్నిహితుడు బండ్ల గణేష్.! ప్రస్తుతానికి బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో వున్నాడు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. బండ్ల గణేష్‌కి చాలా పార్టీలతో చాలా చాలా సన్నిహిత సంబంధాలున్నాయ్.
అప్పటికప్పుడు, ఏదో ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని, ఇంకో పార్టీ మీద చెలరేగిపోవడం బండ్ల గణేష్ స్పెషాలిటీ.! ఇప్పుడు తాజాగా, బండ్ల గణేష్ ప్రేమ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీదకు మళ్ళింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టయి చంద్రబాబు జైలుకు వెళ్ళడాన్ని బండ్ల గణేష్ తీవ్రాతి తీవ్రంగా ఖండించేశాడు. అంతేనా, ఆయన కారణంగా హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందనీ, అందులో రాణిస్తున్న వారంతా, చంద్రబాబుకి మద్దతు పలకాలనీ డిమాండ్ చేసేశాడు బండ్ల గణేష్.
ఓ నెల రోజులు ఉద్యోగాలు మానెయ్యండి.. మీ సొంతూళ్ళకి వెళ్ళి, చంద్రబాబుకి అనుకూలంగా నిరసనలు తెలపండి.. ఏం ఆ మాత్రం చేయలేరా.? అని నిలదీసేశాడు బండ్ల గణేష్. కామెడీ కాకపోతే, ఉద్యోగాలు పోగొట్టుకోవాలని సలహా ఇవ్వడమేంటి బండ్ల గణేషా.!
‘నేను కాంగ్రెస్ పార్టీ వాడినైనాగానీ.. చంద్రబాబుకి మద్దతిస్తున్నా’ అని బండ్ల గణేష్ చెప్పుకున్నాడు