తప్పు చేశారని ప్రాథమిక సమాచరం ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు.. అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు.. ఈ సమయలో ఆ నేరంలో వీరి పాత్ర ఉందని కోర్టు నమ్మితే రిమాండ్ కు తరలిస్తారు.. అనంతరం వాదనలు, తీర్పులు… తెలిసిందే! నేరం రుజువైతే జైలుకి.. రుజూవు కాకపోతే ఇంటికి!! అయితే ఈ విషయంలో తప్పు చేశారనే విషయం కంటికి కనిపిస్తున్నా, చెవికి వినిపిస్తున్న్నా… నిస్సిగ్గు సమర్ధనకు తెరలేపుతుంది మీడియా అని చెప్పుకునే ఒక వర్గం మీడియా!
చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కాం జరిగిందనే విషయంపై అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది. విషయం గ్రహించిన కోర్టు.. రిమాండ్ కు తరలించింది. అయితే స్కాం జరిగిందా లేదా అనే విషయంపై మాత్రం మాట్లాడని ఒక వర్గం మీడియా… అరెస్ట్ చేసిన విధానంపై మాత్రమే స్పందిస్తూ… సుద్దులు చెబుతుంది!
ఇక తాజాగా బండారు సత్యనారాయణ మూర్తి విషయానికొస్తే… తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో కూడా ఆ మీడియా అడ్డగోలు వాదనలకు తెరలేపుతుంది! దీంతో… మొత్తానికి సిగ్గు వదిలేశారు అనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది. 22 గంటల పాటు నాటకీయ పరిణామాల మధ్య బండారు… మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్టు అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది
కాస్త ఇంగితం ఉన్న ఎవరైనా.. ఇంట్లో తల్లి, సోదరి, భార్య, కూతురు వంటి స్త్రీలు ఉన్నవారెవరూ ఆ వ్యాఖ్యలను సమర్ధించరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె ఎంత శత్రువు అయినా.. మరెంత ప్రత్యర్థి అయినా… బహిరంగంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత నీచమైన చర్య అని అంటున్నారు. ఈ సమయంలో మహిళా కమిషన్ స్పందించింది. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది.
ఈ సమయంలో గుంటూరులో బండారు పై కేసు నమోదైంది. ఈ సమయంలో అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు హడావిడి చేశారని, గోడలు దూకారని, తలుపులు బద్దలు కొట్టారని రాసుకొస్తోంది ఒక వర్గం మీడియా. ఇంట్లో దూరి తలుపులు గొళ్లెం పెట్టుకుంటే పోలీసులు.. ఒకే సార్ బాయ్ అని చెప్పి వెనక్కి వెళ్లిపోవాలేమో ఆ మీడియాధిపతులు, పత్రికాధిపతులకే తెలియాలి… సృహలో ఉంటే!
కాగా… మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారయణ వివాదాస్పద వ్యాఖయ్లు చేసిన సంగతి తెలిసిందే. ఏమాత్రం ఇంగితం ఉన్నవారు అలాంటి మాట్లాడరు.. అన్నం తినేవారేవరూ వాటిని సమర్ధించరు అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… గుంటూరులో కేసులు నమోదయ్యాయి. దీంతో బండారుని గుంటూరు పోలీసులు ఏసీ కార్లో ఎక్కించుకుని తీసుకొచ్చారు. దీనిపై కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు!
గాంధీ జయంతి రోజు అన్యాయంగా..:
వినేవాడు ఆంధ్రుడైతే చెప్పేవాడు టీడీపీ నేత అన్నట్లుగా తయారయ్యిందనే కామెంట్లకు బలం చేకూర్చేలాంటి సంఘటన ఈ సందర్భంగా చోటు చేసుకుంది. మహిళలా మంత్రిపై నిస్సిగ్గు వ్యాఖ్యలు చేసిన బండారుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్న సమయంలో స్పందించిన ఆయన… గాంధీ జయంతి రోజున అన్యాయంగా అక్రమంగా ఏ కారణం లేకుండా అరెస్టు చేశారు అని చెప్పుకొచ్చారు.
దీంతో ఒకపక్క చంద్రబాబు, మరోపక్క బండారు… గాంధీ పేరుని అవినీతి కేసుల్లో అరెస్టవ్వడం దారుణం అని, మహిళలపై అసభకరమైన మాటలు మాట్లాడిన కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయమని చెప్పడం అసహ్యం కాక మరేమిటి? మహాత్మ గాంధీ చనిపోయి బ్రతికిపోయారు కానీ…!!
దీంతో… మహిళలపై అసభ్యకరంగా మాట్లాడినప్పుడు గుర్తుకు రాని గాంధీ… పోలీసులు అరెస్ట్ చేయగానే గుర్తుకు వచ్చారు. మరి ఇంట్లో భార్యను పెట్టుకుని మరొకరి భార్యపై ఇలా మాట్లడినందుకు దేవుడు ఎప్పుడు కనిపిస్తాడో, ఎక్కడ కనిపిస్తాడో, ఏ “డిగ్రీ”లో కనిపిస్తాడో వేచి చూడాలి!