నారా లోకేష్‌ని ఇరికించేసిన ‘బిత్తిరి’ బాలయ్య.!

నందమూరి బాలకృష్ణ నోరు జారుడేంది.? నారా లోకేష్‌కి ఇంకెవరో వార్నింగ్ ఇవ్వడమేంటి.? వింతగా వుంది కదా.! అదే మరి.! సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.. అదీ సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులను ఉద్దేశించి. అక్కినేని నాగేశ్వరరావు మనవళ్ళు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇంకోపక్క, ‘కాపునాడు’ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ‘మీ నాన్న ఎన్టీయార్ కంటే గొప్ప వ్యక్తి ఎస్వీ రంగారావు.. ఆయన్ని పట్టుకుని తూలనాడతావా.?’ అంటూ కాపునాడు మండిపడింది. ఈ నెల 25 లోగా బాలకృష్ణ బేషరతు క్షమాపణ చెప్పాలని కూడా కాపునాడు డిమాండ్ చేసింది.

క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయట. ఆ తీవ్ర పరిణామాలేంటో తెలుసా.? నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడం. అక్కినేని అభిమానులు కొందరు ఇదే విషయమై టీడీపీకి అల్టిమేటం జారీ చేస్తున్నారు.

ఎక్కడో జరిగిన ఏదో వ్యవహారం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తప్పదు మరి.. బాలకృష్ణ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా. అసలు ‘ఇలాంటోడ్ని చట్ట సభలకు ఎలా పంపించారు.?’ అని హిందూపురం నియోజకవర్గ ప్రజల్ని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం. బాలయ్యా.. ఎంత పెంట పెట్టావయ్యా.?