Balayya Was Cornered By Ys Jagan : బాలయ్యపై మాటల తూటాల్ని పేల్చిన వైఎస్ జగన్

Balayya Was Cornered By Ys Jagan

Balayya Was Cornered By Ys Jagan : అయ్యోపాపం బాలయ్య.! చంద్రబాబు హయాంలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా అడగలేకపోయారుగానీ.. చంద్రబాబు హయాంలో అడుగుతున్నారు.

ఇదెక్కడి చోద్యం.? ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన స్థాయిలోనే చర్చ జరిగింది.. బాలయ్య మీద పేలాల్సిన స్థాయిలోనే సెటైర్లు పేలాయి.

ఇక, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ పేరెత్తకుండానే సెటైర్లు వేసేశారు. బావ, బావమరిది.. అంటూ చంద్రబాబునీ, బాలయ్యనీ పరోక్షంగా ప్రస్తావిస్తూ కడిగి పారేశారు.

ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయలేకపోతున్నారుగానీ, మా ప్రభుత్వ హయాంలో కుప్పం రెవెన్యూ డివిజన్ కోసం డిమాండ్ చేస్తున్నారు.. మాది పని చేసే ప్రభుత్వమని బహుశా చంద్రబాబుకీ, ఆయన బావమరిదికీ అర్థమయ్యే వుంటుంది.. అన్నది వైఎస్ జగన్ పేల్చిన తూటా.

వైఎస్ జగన్ మాటల్లోనూ నిజం లేకపోలేదు. చంద్రబాబు హయాంలో ఎన్టీయార్ జిల్లా ఏర్పాటు చేయలేకపోయారు. వైఎస్ జగన్ హయాంలో ఎన్టీయార్ జిల్లా ఏర్పాటవుతోంటే, ఆ జిల్లాకి ఆ పేరెందుకు పెట్టారు.? ఇంకో జిల్లాకి ఎందుకు ఆ పేరు పెట్టలేదు.? అంటూ టీడీపీ దీర్ఘాలు తీస్తోన్న సంగతి తెలిసిందే.

చాలా విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదవి విప్పడంలేదంటూ అసహనం వ్యక్తం చేసినవారికి బ్యాక్ టు బ్యాక్ పంచ్ డైలాగుల్ని అసెంబ్లీ వేదికగా ఇవ్వాల్సిన స్థాయిలోనే ఆయన ఇచ్చేస్తున్నారన్నమాట.