ఒకే వేదికపై బాలయ్య , విజయ శాంతి ..?

సోమవారం నాడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడం ఇటు బాలయ్య అభిమానుల్లో అటు తెలుగు దేశం పార్టీ కార్య కర్తల్లో ఉత్సహం , ఉత్తేజాన్నీ నింపాయని చెప్పవచ్చు . అంతే కాదు బాలయ్య పర్యటన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కూడా ఆనందాన్ని కలిగించిందని అంటున్నారు . చాలా కాలం నుంచి తెలుగు దేశం నాయకులు ముఖ్యంగా చంద్ర బాబు నాయుడు , లోకేష్ ఇక్కడ పర్యటించడం మానేశారు .

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ విషయంలో ఏరకంగా ముందుకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో బాలయ్య తమ తండ్రి విగ్రహావిష్కరణ కోసం ఖమ్మం జిల్లాలో పర్యటించాడు . తెలంగాణాలో బాలకృష్ణ మొదటిసారి పర్యటిస్తున్నారు అక్కడి ప్రజలు ఏరకంగా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నారు . బాలయ్యకు తెలంగాణ ప్రజలు బ్రహ్మ రథం పట్టారు . ఈ వార్తతో చంద్ర బాబు ఎంతో ఆనందంగా వున్నాడట. తెలంగాణ లో తమకు ఆదరణ తగ్గలేదని బాబు ధీమాగా వున్నాడట . బాలయ్య అనే అస్త్రాన్ని ప్రయోగిస్తే ఫలితాలు బాగుంటాయని బాబు భావిస్తున్నాడట.

ఇదిలా ఉంటే బాలయ్య పర్యటన విషయమై కాంగ్రెస్ పార్టీ కూడా చాలా నిశితంగా గమనించింది . కాంగ్రెస్ పార్టీ ,తెలుగుదేశం పార్టీ కలసి ఎన్నికల్లో పోటీచేయబోతున్నాయి కాబట్టి బాలయ్య ప్రచారం తమకు లభిస్తుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది . కాంగ్రెస్ పార్టీకి స్టార్ కాంపైనర్ గా వున్న విజయశాంతి కూడా ఈసారి తన శక్తి యుక్తులన్నీ ఉయోగిస్తుందని , తెలంగా రాష్ట్రంలో ఆమె సుడిగాలి పర్యటన చేస్తుందని కూడా తెలిసింది .

బాలకృష్ణ ,విజయ శాంతిని కొన్ని ముఖ్యమైన వేదికలపై ప్రచారం చేసేలా ప్రణాళిక తయారు చెయ్యాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందట. బాలకృష్ణ , విజయ శాంతి ఇద్దరు కలసి ప్రచారం చేస్తే ఊహించని ఫలితాలు సాధించ వచ్చని అనుకున్నటున్నారట . ఒకప్పుడు హీరో హీరోయిన్ గా అనేక సినిమాలో నటించిన విజయ శాంతి, బాలయ్య మారిన పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనం కోసం ఒకే వేదిపైకి వచ్చే అవకాశం ఎక్కువగా వుంది . ఇదే జరిగితే తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారె అవకాశం వుంది .