స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైనప్పటినుంచీ ఏపీలో టీడీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే… తెలుగుదేశం పార్టీని నందమూరి వంశీకులు చేతుల్లోకి వెళ్లే సువర్ణావకాశం వచ్చిందనే కామెంట్లు కూడా వినిపించాయి. దీంతో నారా వారు అలర్ట్ అయ్యారని అంటున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబు ఈ మేరకు పక్కా స్కెచ్ వేశారని తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చేశాయి.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాబు అరెస్టైనప్పౌడు.. ఆయన అరెస్టును చూసి చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తాను అని బాలయ్య మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారని అంటున్నారు.
ఇలా బాలయ్య జనాల్లోకి వెళ్తానని ప్రకటించగానే జైల్లో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడ్డారని చెబుతున్నారు. దింతో… బాలయ్య ప్రకటన తర్వాత రెండు రోజులకు పవన్ తో పొత్తు అని అనౌన్స్ చేయించారు. ఫలితంగా… చంద్రబాబు కొత్త వ్యూహాన్నే జైలు గోడల నుంచి రచించారు అని అర్ధం అయింది అంటున్నారు పరిశీలకులు.
మరో వైపు లోకేష్ తో పాటు బాలయ్యను మెంబర్స్ గా చేసి పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా నందమూరిని కట్టడిచేసే కార్యక్రమాంలు బాబు వరుసగా చేశారు. ఇక ఇప్పుడు మడో అడుగు ముందుకేసిన బాబు… ఏకంగా లోకేష్ అధ్యక్షతన టీడీపీ మీట్ ఏర్పాటు చేయిస్తున్నారు. అంతేకాదు… బాలయ్య ప్రకటించిన ఓదార్పు యాత్రను సైడ్ చేసి, భువనేశ్వరిని లైన్ లోకి తీసుకొచ్చారు.
అందులో భాగంగా… బాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి వచ్చే వారం నుంచి ఏపీ అంతటా పర్యటించనున్నారు. బాబు తో ములాఖత్ అయిన వెంటనే టీడీపీ నుంచి వెలువడిన ప్రకటన ఇది. అంటే… ఇకపై ఓదార్పు యాత్రలు అన్నీ భూవనేశ్వరి చూసుకుంటారు అన్న మాట. పార్టీ వ్యవహారాలు అన్నీ లోకేష్ చూసుకుంటారన్నమాట. దీంతో బాబు వ్యూహం అర్ధమైందని అంటున్నారు పరిశీలకులు.
సరిగ్గా ఈ సమయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు లైన్ లోకి వచ్చారు. తాజాగా మైకందుకున్న ఆయన… జైలు గోడల మధ్య నుంచే చంద్రబాబు, పార్టీ నందమూరి కుటుంబం చేతిలోకి పోకుండా కుట్రలు చేస్తున్నారు అని కామెంట్స్ చేసారు. ఓదార్పు యాత్ర చేపడతాను అని మొదట బాలయ్య ప్రకటిస్తే ఇపుడు భువనేశ్వరిని వెళ్లమనడం ద్వారా బాలయ్యకు చెక్ చెప్పేశారు అని అంబటి తదైన టైపులో స్పందించారు.
అంబటి రాంబాబు అన్నారనో, ఎవరో కామెంట్ చేశారనో కాదు కానీ… ఇలా బాలయ్య ప్రకటించిన ఓదార్పు యాత్రను చంద్రబాబు.. భువనేశ్వరితో చేయించడం దారుణం అనే మాటలు వినిపిస్తున్నాయి. భువనేశ్వరి కంటే బాలయ్యకే జనాలు కాస్త ఎక్కువగా వస్తారనే ఆలోచనను… నందమూరి చేతుల్లోకి టీడీపీ అనే భయం కమ్మేసిందని చెబుతున్నారు. దీంతో… బాబు అరెస్ట్ పై బాలయ్య ఫ్యాన్స్ కూడా జాలి పడటం మానేశారనే గుసగుసలు తమ్ముళ్ల మధ్య వినిపిస్తుండటం గమనార్హం!