జగన్ ను టార్గెట్ చేయబోతున్న బాలయ్య.. చంద్రబాబు ఎలా స్పందిస్తారో?

సినిమాలు, రాజకీయాలు వేర్వేరు రంగాలు కాగా ఈ రెండు రంగాలలో సక్సెస్ సాధించిన అతికొద్ది మందిలో బాలకృష్ణ ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు కావడం, కష్టపడే టాలెంట్ ఉండటంతో బాలయ్య అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో సక్సెస్ అయ్యారు. అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చే హీరోగా అభిమానులతో ఫ్రెండ్లీగా ఉండే హీరోగా స్టార్ హీరో బాలకృష్ణకు పేరుంది. అయితే జగన్ బాలయ్య అభిమాని అయినా జగన్ అంటే బాలయ్యకు నచ్చడనే సంగతి తెలిసిందే.

బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్2 షో ప్రసారం కానుండగా ఫస్ట్ సీజన్ ను మించి ఈ షో ఉండనుందని తెలుస్తోంది. అన్ స్టాపబుల్2 కు చంద్రబాబు గెస్ట్ గా హాజరు కానున్నారు. అయితే చంద్రబాబు ఈ షోకు రావడం ద్వారా టీడీపీకి కచ్చితంగా మేలు జరిగేలా చేయనున్నారని బోగట్టా. అటు చంద్రబాబు ఇటు బాలకృష్ణ తమ గురించి జరుగుతున్న ట్రోలింగ్ కు ఈ షో ద్వారా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

జగన్ పై కూడా చంద్రబాబు ఈ షో ద్వారా విషం కక్కనున్నారని తెలుస్తోంది. జగన్ ను టార్గెట్ చేయడానికి ఇదే మంచి అవకాశమని బాలయ్య భావిస్తున్నారని బోగట్టా. ఇలాంటి వివాదాస్పద అంశాలు అన్ స్టాపబుల్ సీజన్2 కు ప్లస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆహా నిర్వాహకులు సైతం చంద్రబాబు ఈ షోకు హాజరు కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది.

అన్ స్టాపబుల్ సీజన్ 2కు హాజరయ్యే సెలబ్రిటీల జాబితాలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే చాట్ షోల ద్వారా తమ పార్టీని టార్గెట్ చేస్తే వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. చాట్ షోతో టీడీపీకి ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలిగేలా బాలయ్య ప్లాన్ చేశారని తెలుస్తోంది.