చిరంజీవితో బాలకృష్ణ భేటీ.! సిని‘మా’ కోసమేనా.?

మెగాస్టార్ చిరంజీవితో నందమూరి బాలకృష్ణ భేటీ కాబోతున్నారట. ఇందులో వింతేముంది.? అంటే, లేకనేం.. చాలానే వుంది. పలు వేదికలపై చిరంజీవి, బాలకృష్ణ కలుసుకుంటుంటారు.

అయితే, చాలా అరుదుగా. బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’లో ఇంతవరకు చిరంజీవి పాల్గొనలేదు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం పాల్గొన్నాడు. దాంతో, చిరంజీవి ఎప్పుడు.? అన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంది. అయితే, నిర్వాహకులు చిరంజీవిని సంప్రదించలేదా.? బాలయ్య ఒప్పుకోలేదా.? లాంటి ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

ఇంతకీ, బాలయ్య – చిరంజీవి భేటీ దేనికోసం.? అన్‌స్టాపబుల్ టాక్ షో కోసమా.? లేదంటే, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాల మీదనా.? ఇవేవీ కాదు, ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారా.?

రాజకీయాల సంగతేంటి.? ఇదీ అసలు పాయింటు.! త్వరలో చిరంజీవితో నందమూరి బాలకృష్ణ భేటీ అవడం వెనుక, రాజకీయ కోణం వుండబోతోందిట. తమ్ముడు పవన్ కళ్యాణ్ చొరవతో, అన్నయ్య చిరంజీవి దగ్గరకి నందమూరి బాలకృష్ణ వెళ్ళబోతున్నారట.

ఈ భేటీలో సినిమా అంశాలు చర్చకు వస్తాయనీ, అదే విషయాన్ని పైకి చెబుతారనీ అంటున్నారు. తెరవెనుకాల, రాజకీయ మంత్రాంగం ఖచ్చితంగా వుంటుంది. టీడీపీ – జనసేన పొత్తుకి ఇదొక బూస్టప్ అనుకోవాలేమో.!