మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరావడం లేదు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా రెండు నియోజకవర్గాలలో చేదు ఫలితాలు ఎదురయ్యాయి. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు సైతం ఓటమి తప్పదని వైసీపీ నేతలు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చంద్రబాబుకు ఇలాంటి దయనీయ పరిస్థితి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపీనే కారణం కావడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ నేతలు సైతం చంద్రబాబు నాయుడును అస్సలు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. 2024 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు ఎక్కువమంది కాదనే సమాధానం ఇస్తున్నారు. చంద్రబాబు జగన్ పై పాత చింతకాయ పచ్చడి ఆరోపణలు చేస్తూ ప్రజలకు మరింత దూరమవుతున్నారు. జగన్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఆ ఆరోపణలను ప్రూవ్ చేసే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతుండటం గమనార్హం.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా జగన్ పాత్ర ఉందని చంద్రబాబు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ నేతలు తమ అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా ప్రచారం చేస్తుండటం గమనార్హం. వైసీపీ ప్రభుత్వం ప్రజల విషయంలో చేస్తున్న తప్పులను విమర్శించకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్లే టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే మాత్రం టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం దాదాపుగా అసాధ్యమని సర్వేలు చెబుతున్నాయి. సర్వేల ఫలితాలు నిజమైతే మాత్రం టీడీపీనే నమ్ముకున్న నేతల పరిస్థితి దారుణంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితులు లేవని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.