చంద్రబాబుని రాముడితో పోల్చిన అయ్యన్న.. మరి రావణుడు ఎవరు?

ఏపీలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా వైసీపీ 151 ఎమ్మెల్యే స్థానాలలో విజయం సాధించింది. మరి వైసీపీలో ఉన్న నమ్మకం భవిష్యత్తులో ఏపీలో పోటీ చేసే ఇతర పార్టీలకు ఉందా? అనే ప్రశ్నకు నో అనే సమాధానం వినిపిస్తోంది. పొత్తు లేకుండా ఎన్నికలకు వెళితే తమ పార్టీలకు వచ్చే ఫలితాలు దారుణంగా ఉంటాయని ప్రముఖ రాజకీయ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అయితే తాజాగా అయ్యన్న పాత్రుడు చంద్రtబాబు నాయుడుని రాముడితో పోల్చారు. రాముడు రావణుడితో యుద్ధం చేయడానికి ఎంతోమంది సహాయం తీసుకున్నారని అదే విధంగా చంద్రబాబు నాయుడు సహాయం తీసుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు రాముడు అయితే జగన్ రావణుడా? అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికి టీడీపీ నేతలు గొప్పగా కామెంట్లు చెయ్యడానికి సిద్ధపడుతున్నారని మరి కొందరు చెబుతున్నారు. జగన్ తలచుకుని ఉంటే ఈపాటికి టీడీపీ ఖాళీ అయ్యేదని అయితే జగన్ మాత్రం నీతివంతంగా రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేయడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ను ఉడుతతో అయ్యన్న పోల్చడం గురించి నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతల కామెంట్లు శృతి మించుతున్నాయని మరి కొందరు చెబుతున్నారు. టీడీపీ, జనసేన విడిపోయే రోజులు దగ్గర పడ్డాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.