వైఎస్ వివేకా ఆస్తిపాస్తులెంత.?

వైఎస్ వివేకానంద రెడ్డి సౌమ్యుడు.! ఈ విషయం రాజకీయాలతో పరిచయం వున్నవారందరికీ తెలుసంటారు.! అనడమంటీ.? స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. ‘నాలా కాదు, చాలా సౌమ్యుడు నా సోదరుడు’ అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పడం కూడా చూశాం.

సరే, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు అర్థాలు వేరులే.. అని చెప్పుకోవాల్సి వస్తుందనుకోండి.. అది వేరే సంగతి. ల్యాండ్ సెటిల్మెంట్లు.. ఇలా చాలానే వ్యవహారాలు తెరవెనుకాల నడిపారట వైఎస్ వివేకానంద రెడ్డి.

అలా సంపాదించిన సంపాదనకు సంబంధించిన పంపకాల విషయంలోనే అభిప్రాయబేధాలొచ్చి.. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారన్నది ఓ వాదన. వైసీపీ నుంచి ఈ వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల్లో వైఎస్ వివేకా కొట్టుమిట్టాడారని చెబుతున్నది వైసీపీనే.. అదే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన ఆస్తుల విషయమై గొడవలు జరుగుతున్నాయని అంటోన్నది కూడా వైసీపీనే. నిజానికి, వైసీపీలో ఇంత గందరగోళం ఇంతకు ముందెన్నడూ లేదు.

అసలు ఈ విషయమై వైసీపీ అధినాయకత్వం నుంచి పార్టీ శ్రేణులకు కావొచ్చు, అనుకూల మీడియాకి కావొచ్చు ఎవరు సమాచారం ఇస్తున్నారోగానీ, అది గందరగోళాన్ని మరింత పెంచుతోంది. వైఎస్ వివేకా గనుక అక్రమార్కుడు అయితే, అది వైసీపీకే చెడ్డపేరు… ఈ కోణంలో వైసీపీ అధినాయకత్వం ఎందుకు ఆలోచించడంలేదో ఏమో.!