తిరుపతిని నాశనం చేశారు.. అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన అశ్వనీదత్ నిర్మించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మరికొన్ని రోజుల్లో అశ్వనీదత్ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సినిమా థియేటర్లలో విడుదల కానుంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అశ్వనీదత్ మాట్లాడుతూ జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం ఉందని ఆయన కామెంట్లు చేశారు.

వెయ్యికాళ్ల మండపం తొలగించిన సమయంలో చినజీయర్ స్వామి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని అయితే చంద్రబాబు నాయుడు ఆగమ శాస్త్రం ప్రకారమే ఆ మండపాన్ని తొలగించడం జరిగిందని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గడిచిన మూడు సంవత్సరాలలో తిరుపతిని సర్వ నాశనం చేసిందని అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వెంకటేశ్వర స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఏపీలో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నాయని మత మార్పిళ్లు జరుగుతున్నా చినజీయర్ స్వామి ఎందుకు మాట్లాడటం లేదని అశ్వనీదత్ అన్నారు. చినజీయర్ స్వామి తాజాగా ఒక సందర్భంలో జగన్ ను దైవాంశ సంభూతుడని పొగిడారని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.

చినజీయర్ స్వామి మాటలు విన్న వెంటనే నాకు కడుపు మండిపోయిందని అశ్వనీదత్ తెలిపారు. సమ్మక్క సారక్క అంటే ప్రజలలో ఎంతో విశ్వాసం ఉందని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం సమ్మక్క సారక్కలను దేవతలుగా భావిస్తారని అశ్వనీదత్ వెల్లడించారు. సమ్మక్క సారక్కలను దేవతలు కాదని చినజీయర్ స్వామి చెప్పడం నాకు ఎంతో బాధను కలిగించిందని అశ్వనీదత్ తెలిపారు.