స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితె ఈ సమయంలో ఈ పిటిషన్ పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో మరో పిటిషన్ టెన్షన్ మొదలైందని తెలుస్తుంది.
అవును… ఒక ఐదు రోజుల పాటు చంద్రబాబుని తమ కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్ కి సంబంధించిన వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఈ పిటిషన్ పై ఇప్పటి వరకు కౌంటర్ పిటీషన్ ఎందుకు వేయలేదని ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు తరపు లాయర్లను ప్రశ్నించింది.
దీంతో.. రేపు కౌంటర్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు హౌజ్ రిమాండ్ ఇవ్వాలన్న పిటిషన్ ను సాయంత్రం విచారించనుంది కోర్టు. ఇదే సమయంలో చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదంటూ అడ్వొకేట్ జనరల్ కు ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ లేఖ రాశారు.
ఇదే సమయంలో ఏపీ సీఐడీ ఎఫ్.ఐల్.ఆర్. పై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా… ఎఫ్.ఐ.ఆర్. లో చంద్రబాబు పేరు లేకుండా అరెస్ట్ చేశారని.. రిమాండ్ రిపోర్ట్ లోని ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగమే అని ఆ పిటిషన్ లో చంద్రబాబు న్యాయవాదులు పేర్కొన్నారు.
మరోపక్క భద్రతా కారణాల దృష్ట్యా చంద్రబాబు హౌజ్ అరెస్ట్ ను రిమాండ్ గా పరిగణించాలని చంద్రబాబు లాయర్లు వాదించారు. దీంతో… చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని.. బయట ఉంటే సాక్షులని ప్రభావితం చేసే అవకాశముందని.. గృహ నిర్బంధం పిటిషన్ కి విచారణ అర్హత లేదని సీఐడీ తరఫున గట్టి వాదనలు వినిపించారు ఏఏజీ సుధాకర్ రెడ్డి.
ఇదే సమయంలో… చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని ఆయన తరుపు న్యాయవాధి లూథ్రా చేసిన వ్యాఖ్యలపై ఏఏజీ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి పూర్తి భద్రత ఉందని, చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు కూడా ఇస్తున్నారని తెలిపైన ఆయన. జైల్లో కరుడుగట్టిన నేరస్తులు కాకుండా స్వామీజీలు ఉంటారా అని ప్రశ్నించారు.