మొత్తానికి ఏపిలోని రెండు ప్రధాన పార్టీల వ్యవహారంతో ఓటర్లలో మాత్రం చైతన్యం వచ్చినట్లే కనబడుతోంది. కక్షగట్టి తమ లక్షల సంఖ్యలో తమ ఓట్లను అధికార తెలుగుదేశంపార్టీ ఏరేస్తోందని వైసిపి నేతలు ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. దానికి మద్దతుగానా అన్నట్లు ఐటి గ్రిడ్ సంస్ధ దగ్గర దొరికిన 3.5 కోట్లమంది జనాల వ్యక్తిగత వివరాలతో చంద్రబాబునాయుడు అండ్ కో కు చెమటలు పట్టింది.
ఓట్ల ఏరివేతలో తాము చేస్తున్న ఛండాలపు పనులు ఆధారాలతో సహా బయటపడటంతో చంద్రబాబు అండ్ కో ఎదురుదాడికి దిగింది. తమ ఓట్లనే వైసిపి ఎత్తేస్తోందనే చవకబారు ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సరే ఎవరి ఓట్లను ఎవరు ఎత్తేస్తున్నారు అన్న విషయాన్ని పక్కకుపెడదాం. ఎందుకంటే, ఆ విషయాలను పోలీసులు తేలుస్తారు.
అయితే, గమనించాల్సిన విషయం ఏమిటేంటే ఓటర్లు మాత్రం అప్రమత్తమయ్యారు. ఓట్లను ఏరియటమనే ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓటర్లలో చైతన్యం తెచ్చాయనే చెప్పాలి. అర్జంటుగా జాబితాలో తమ ఓట్లున్నది లేంది ఓటర్లు చూసుకుంటున్నారు. ఓట్లున్నది లేనిది చెక్ చేసుకోమంటూ వెబ్ సైట్ అడ్రస్ ను, వాట్సప్ సమాచారంతోను, మొబైల్ యాప్ వివరాలకు విస్తృతం ప్రచారం చేస్తోంది.
అదే సమయంలో వైసిపి నేతలు కూడా జాబితాలో పేర్లున్నది లేంది చెక్ చేసుకునే విషయంలో సూచనలు చేస్తోంది. దాంతో మొబైల్ యాప్ లు, వెబ్ సైట్లలో ఓటర్లు తమ పేర్లున్నది లేంది చెక్ చేసుకుంటున్నారు. మొత్తానికి జాబితాలో పేర్లను చెక్ చేసుకునే విషయంలో ఓటర్లలో చైతన్యం వచ్చిందంతే చాలు. ఓట్ల కోసం రెండు ప్రధాన పార్టీలు గొడవ పడటం సామాన్య ఓటర్లకు మేలే చేసింది.