ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో 100 ఉద్యోగ ఖాళీలు!

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. పాడేరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 27వ తేదీన యోకోహమా సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిజిష్టర్ చేసుకుని ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం మధ్య పాసైన ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

 

18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమెన్ అప్రంటీస్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 5 అడుగుల 3 ఇంచుల ఎత్తు ఉన్న అమ్మాయిలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

https://docs.google.com/forms/d/e/1faipqlse4dxutqr-_udko0yuurivmprh_6rutn0jngqkpochdir7tiq/viewform లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం రిజిష్టర్ చేసుకుంటారో వాళ్లను హెచ్.ఆర్ రౌండ్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 9398338105, 9014767230 నంబర్ల ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లాలో పని చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ కంపెనీలలో సైతం ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చుతోంది.