ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలలో వేంకటేశ్వరుడి సేవలో ఆయన పాల్గొన్నారు. నిమ్మగడ్డకు రమేష్ కుమార్‌కు టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
స్వామి వారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలకు అందజేశారు. ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరుస పర్యటనలు చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పటికే కడప, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు మంచిదేనని.. కానీ బలవంతం చేయొద్దని హెచ్చరించారు. ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషనర్ వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ బలవంతంగా, బెదిరింపులకు గురిచేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏకగ్రీవాల సంఖ్య భారీగా పెరుగుతుండటమే తాము దృష్టి పెట్టడానికి ప్రధాన కారణమని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగే వాతావరణాన్ని సృష్టిస్తున్నామని…ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించిన E-వాచ్ యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. యాప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం… యాప్ ను నిలిపేయాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. యాప్ వినియోగంపై స్టే ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారించనుంది.