టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ అభిమానుల బలమైన కోరిక. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.
ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫోటోతో పాటు కాబోయే ముఖ్యమంత్రి అని రాశారు.
ఫ్లెక్సీలో కుర్చీలో కాలు మీద కాలు వేసుకున్న తారక్ ఫోటో ఉంది. ఇదే ఫ్లెక్స్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, బాలయ్య, హరికృష్ణ, అచ్చెన్నాయుడు..ఇతర స్థానిక నాయకుల ఫోటోలు ఉన్నాయి. మొదట ఈ ఫ్లెక్సీ చూసి టీడీపీ నేతలు వర్గాలుగా చీలిపోయారు. కొందరు అందులో తప్పేముందని ఆఫ్ ది టాక్ ప్రశ్నిస్తుండగా..మరికొందరు ఆ ఫ్లెక్సీకు, తమకు ఏం సంబంధం లేదని చెబుతున్నారు. అయితే , యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై ప్రశ్నించిన ప్రతిసారీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ తమదేనని.. ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం ఏముందని కామెంట్ చేశారు.