ఏపీలో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.20,000 వేతనంతో?

Job-Vacancy

ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 

ఈ ఉద్యోగాలలో ఫిజిక్స్ విభాగంలో 3 ఉద్యోగ ఖాళీలు ఉండగా కెమిస్ట్రీ 2 ఉద్యోగ ఖాళీలు ఉండగా బయాలజీ 5 ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం. సంబంధిత సబ్జెక్ట్ లో బీఎస్సీ డిగ్రీ పూర్తైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2022 సంవత్సరం జులై1 నాటికి 34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

 

https://citizen.appolice.gov.in/jsp/homepage.do?method=gethomepageelements వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, మంగళగిరి అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. రాతపరీక్ష, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది.

 

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.