ఏపీలో 115 అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలు.. ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త్ చెప్పింది. ఏపీలో 115 అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.

కనీసం పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. అర్హతలు ఉన్నవాళ్లు దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని సమీపంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ లో అందించాల్సి ఉంటుందని సమాచారం. కడప జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

https://kadapa.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పదో తరగతి మార్కులతో పాటు ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 7000 రూపాయల నుంచి 11500 రూపాయల వరకు వేతనం లభించనుంది.

నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రయోజనం చేకూరనుంది. రాబోయే రోజుల్లో వేతనాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఎంతగానో బెనిఫిట్ కలగనుంది.