ఆంధ్ర ప్రదేశ్ : మహేష్ బాబు నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘భరత్ అనే నేను’ అందరికి గుర్తుందిగా, సరిగ్గా ఆ సినిమాలో మాదిరిగా మహేష్ బాబులాగే ఏపీ సీఎం జగన్ ఏపీ వాహనదారులపై కొరఢా ఝలిపించారు. ఆ సినిమాలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏకంగా 30వేల వరకు మహేష్ బాబు సీఎం హోదాలో జరిమానాలు విధించారు. ఇప్పుడు అదే సీన్ ను ఏపీలో సీఎం జగన్ రిపీట్ చేశారని వాహనదారులు అంటున్నారు. ఆ సినిమాలో అంత కాదు కానీ దాదాపు భారీ జరిమానాలనే విధించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయనది.
కేంద్రం ఆమోదించిన కొత్త మోటార్ వాహన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జేబు ఖాళీ అవ్వక మానదు. భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి ఏపీ చేరింది.దీంతో ఏపీ వాహనదారులంతా ఇక ఒళ్లు దగ్గరపెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా నిబంధనల ప్రకారం వాహనాలు నడుపాలన్న మాట.. ఏ మాత్రం తేడా చేసినా ఆ భారీ జరిమానాలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త మోటార్ చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.విశేషం ఏంటంటే.. బైక్ నుంచి 7 సీట్ల కార్ల వరకు ఒకే విధమైన జరిమానాను విధించడం విశేషం. ఇక ఇతర వాహనాలకు అయితే ఇంకా వాచిపోయేలా భారీ జరిమానాలు విధించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది.
* ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టం ప్రకారం జరిమానాలు:-
1) రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు అమ్మినవారికి – రూ.100000
2) ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
3) వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000
4) డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000
5) పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000
6) సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
7) రేసింగ్ మొదటిసారి రూ. 5000 రెండో సారి రూ. 10000
8) ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000
9) అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000
10) రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
11) అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000
12) రిజిస్ట్రేషన్ లేకున్నా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000 రెండో సారి రూ. 5000
13) అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000 రెండోసారి రూ. 2000 జరిమానా
14) వేగంగా బండి నడిపితే – రూ. 1000
15) వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750
16) సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750